Telangana Fossils : డైనోసార్ల యుగపు మొక్కలు.. 6.5 కోట్ల ఏళ్ల నాటి శిలాజాలు లభ్యం

Telangana Fossils : అనగనగా జురాసిక్‌ కాలం (డైనోసార్ల యుగం) నాటి శిలాజాలు మన తెలంగాణలో లభ్యమయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Telangana Fossils Min

Telangana Fossils Min

Telangana Fossils : అనగనగా జురాసిక్‌ కాలం (డైనోసార్ల యుగం) నాటి శిలాజాలు మన తెలంగాణలో లభ్యమయ్యాయి. వాటి వయసును చెక్ చేసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఆ శిలాజ మొక్కల ఏజ్ 6.5 కోట్ల సంవత్సరాలని తెలిసి అవాక్కయ్యారు. అంటే దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం డైనోసార్లు జీవించినప్పటి కాలం నాటి ప్రాచీన మొక్కలవి.  ఇప్పుడు ఆ మొక్కల జాతులు అంతరించిపోయాయి.ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో శిలాజాలు బయటపడుతుంటాయి. వందల సంవత్సరాల క్రితం భూమిలో కూరుకుపోయిన జీవులు క్రమంగా శిలాజంగా మారుతుంటాయి.

We’re now on WhatsApp. Click to Join

పాజియోఫిలమ్‌, పిలోఫిలమ్‌, టినియోఫ్టెరిస్‌ అనే అరుదైన మొక్కల శిలాజాలను(Telangana Fossils) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం రాంపూర్‌ తెల్లసుద్ద భూముల్లో పురావస్తు పరిశోధకుడు సముద్రాల సునీల్‌ గుర్తించారు.దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో చిత్తడి నేలలు, చెరువు ఉండేవని ఈ శిలాజాల ఆధారంగా తెలుస్తోందని ఆయన చెప్పారు. పిలోఫిలమ్‌, టినియోఫ్టెరిస్‌ తరహా  వృక్ష జాతులు చిత్తడి నేలలు, నదీతీర మార్గాల్లోనే ఉండేవన్నారు. ఈ శిలాజాల క్లస్టర్‌ విశ్లేషణ ఆధారంగా అరౌకారియాసి జాతికి సంబంధించినవిగా గుర్తించామన్నారు. ఈ ప్రాంతంలో మరికొన్ని రకాల జంతువుల శిలాజాలు దొరికాయని, వాటి గురించి మరింత పరిశోధన జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఈ మొక్కలు జురాసిక్‌ కాలం వరకు జీవించి ఉండేవని గోండ్వానా యూనివర్శిటీ పీహెచ్‌డీ స్కాలర్‌ నుస్రత్‌ బాబర్‌ వివరించారు.

Also Read : Rahul Gandhi : తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ.. ఆ స్థానాలపై గురి !

భారీ డ్రాగన్‌ శిలాజం

చైనాలో 2003లో బయటపడిన భారీ డ్రాగన్‌ శిలాజం వయసు 24 కోట్ల సంవత్సరాలు ఉంటుందని సైంటిస్టులు ఇటీవల నిర్ధారించారు. ఇంత వయసున్న డ్రాగన్‌ శిలాజం వెలుగుచూడడం ఇదే మొదటిసారి అని నేషనల్‌ మ్యూజియమ్స్‌ స్కాట్లాండ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనాలో ట్రియాసిక్‌ కాలానికి చెందిన ఈ శిలాజం భాగాలను తొలుత 2003లో దక్షిణ చైనాలోని గిజౌ ప్రావిన్స్‌లో గుర్తించారు. గత పదేళ్లలో తవ్వకాల్లో మరిన్ని భాగాలు బయటపడ్డాయి. వాటన్నింటినీ ఒకేచోట అమర్చగా అది ఐదు మీటర్ల డ్రాగన్‌గా తేలింది. 24 కోట్ల ఏళ్ల క్రితమే అది శిలాజంగా మారిపోయిందని పరిశోధకులు కనిపెట్టారు. దీనికి డైనోసెఫాలోసారస్‌ ఒరియంటలిస్‌ అని పేరుపెట్టారు. ముక్కు నుంచి తోక దాకా పూర్తి శిలాజాన్ని ఆవిష్కరించామని ఎన్‌ఎంఎస్‌ సైంటిస్టు డాక్టర్‌ నిక్‌ ఫ్రాసెర్‌ చెప్పారు. ఇది 8 అంకె ఆకారంలో ఉందని, చైనా డ్రాగన్లను గుర్తుకు తెస్తోందని వివరించారు. డ్రాగన్‌ కాల్పనిక జీవి కాదని, నిజంగానే ఉండేదని చెప్పడానికి ఈ శిలాజం ఒక ఆధారమని సైంటిస్టులు అంటున్నారు.

  Last Updated: 27 Feb 2024, 08:58 AM IST