Teachers Shortage: కేసీఆర్ సారూ.. చదువులు సాగెదేలా!

బంగారు తెలంగాణలో ప్రభుత్వ బడులు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.

  • Written By:
  • Updated On - November 22, 2022 / 05:40 PM IST

బంగారు తెలంగాణలో ప్రభుత్వ బడులు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికే సగానికిపై పాఠశాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మరో అంశం ప్రభుత్వ బడులను వేధిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా 64% ఉపాధ్యాయుల కొరతను ఉన్నట్టు తెలుస్తోంది. ఇది రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోంది. తెలంగాణ పౌర స్పందన వేదిక నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 1639 పాఠశాలలను సర్వే చేయగా 1043 పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు నివేదించారు.

సెకండరీ గ్రేడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లతోపాటు దాదాపు 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సర్వే వెల్లడించింది. వివిధ కార్యక్రమాల కింద చేపట్టిన అభివృద్ధి పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఎమ్మెల్సీ, తెలంగాణ పౌర స్పందన వేదిక అధ్యక్షురాలు ఎ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. తాత్కాలిక ఉపాధ్యాయులను తక్షణమే నియమించి, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రకారం, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 26,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

దాదాపు అన్ని పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి బదిలీలు, పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయని ఫెడరేషన్ చెబుతోంది. సర్వే చేసిన పాఠశాలల్లో మొత్తం 498 సెకండరీ గ్రేడ్ టీచర్ల కొరత ఉన్నట్లు తేలింది. గణితం, జీవ శాస్త్రం, ఇతర సబ్జెక్టులకు ఉపాధ్యాయులు అవసరం. నవంబర్ 1 నుంచి 15వ తేదీ మధ్య సర్వే నిర్వహించగా.. సర్వేలో పాల్గొన్న 47% పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సొంత ఖర్చులతో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నట్లు తేలింది.