Site icon HashtagU Telugu

TGSRTC : బతుకమ్మ, దసరాకు 6 వేల ప్రత్యేక బస్సులు: టీజీఎస్ఆర్టీసీ!

Special Buses For Sankranthi

Special Buses For Sankranthi

Dussehra Special Buses:  బతుకమ్మ, దసరాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల అవస్థలను దృష్టిలో ఉంచుకుని నగర శివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల నడపాలని నిర్ణయించింది. అదనపు బస్సులతో ప్రయాణికులు త్వరగా గమ్యాన్ని చేరవచ్చు. ఊళ్లకు వెళ్ల ప్రయాణికుల కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ, తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు.

బతుకమ్మ, దసరా సందర్భంగా ప్రయాణికుల తాకిడి ఎక్కువ ఉంటుంది ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులతో వర్చువల్ గా చర్చించారు. ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆర్టీసీ ఉద్యోగుల బాగా పని చేస్తున్నారన సజ్జనార్ అన్నారు. గతేడాది దసరాతో పోలిస్తే ఈసారి రద్దీ ఉటుందని.. మహాలక్ష్మి పథకంతో ఈ రద్దీ మరింత పెరుగుతుందని తెలిపారు.

Read Also: Jani Master Bail : జానీ మాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వారి గమ్యస్థానాలకు చేర్చాలని కోరారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ పండుగలకు 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.

అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్నందున.. 9, 10, 11 తేదిల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. ఆయా రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరిన్నీ ప్రత్యేక బస్సులను పెంచుతామని వివరించారు. రద్దీ రోజుల్లో ఎన్‌హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లేన్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్, తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలన్నారు.

Read Also: 2 Crore SIMs : ఫేక్ సిమ్‌కార్డుల ఖేల్ ఖతం.. కోట్లాది ‘సిమ్‌’‌లు రద్దు!