Site icon HashtagU Telugu

Tammineni Krishnaiah : టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురు అరెస్ట్

Khammam Murder Imresizer

Khammam Murder Imresizer

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని ఖమ్మం-మహబూబాబాద్ జిల్లాల సరిహద్దులో అరెస్టు చేసినట్లు సమాచారం. మూడు రోజుల క్రితం టీఆర్ఎస్ నేత హత్య కృష్ణ‌య్య హ‌త్య‌కు ఉపయోగించిన ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంజాన్ షేక్, గజ్జి కృష్ణ స్వామి, నూకల లింగయ్య, బి.శ్రీను, బి.నాగేశ్వరరావు, ఏవై నాగయ్యలను అరెస్టు చేసినట్లు సమాచారం. అరెస్టులను ఈ రోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కీలక నిందితుడు, కృష్ణ‌య్య బంధువు తమ్మినేని కోటేశ్వరరావు, కృష్ణ జక్కంపూడి ఇంకా అరెస్ట్ కాలేదు.

ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి గ్రామంలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా కృష్ణయ్య(62)ను నలుగురు దుండగులు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. హత్యకు కోటేశ్వరరావు కారణమని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈయన సీపీఐ-ఎం రాష్ట్ర కార్యదర్శి త‌మ్మినేని వీరభద్రంకి సోదరుడు అవుతాడు. హత్య అనంతరం కృష్ణయ్య మద్దతుదారులు కోటేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. 2019 ఎంపీటీసీకి తెల్దారుపల్లిలో జరిగిన ఎన్నికల విషయంలో ఇరువ‌ర్గాల‌ మధ్య తలెత్తిన విభేదాలు హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

స్థానిక సంస్థలకు ఏకగ్రీవంగా నాయకులను ఎన్నుకునే ఏడు దశాబ్దాల ఆచారానికి తెరపడిన ఈ ఎన్నికల్లో కృష్ణయ్య భార్య మంగతాయ‌మ్మ‌ సీపీఎం బలపరిచిన అభ్యర్థిని ఓడించారు. గతంలో సీపీఎంలో ఉన్న కృష్ణయ్య ఆ తర్వాత తన భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. తమ కోటలో ఎదురుదెబ్బకు కృష్ణయ్య కారణమని కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఇబ్బందిక‌రంగా కలిగించింది.
కృష్ణయ్య టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సన్నిహితుడిగా కూడా ఉన్నారు మరోవైపు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 500 మంది పోలీసులను మోహరించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పరిస్థితిని పర్యవేక్షించారు.