Hyderabad: న్యూయర్ ఎఫెక్ట్.. తాగి వాహనం నడిపినందుకు 5819 లైసెన్స్‌లు రద్దు

కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఐదు జోన్లలో 5819 లైసెన్సులను రోడ్డు రవాణా అథారిటీ (ఆర్‌టీఏ) రద్దు చేసింది. 2021 సంవత్సరంతో పోలిస్తే మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు పాల్పడిన వారి లైసెన్స్‌లు 3,220 ఎక్కువగా ఉన్నాయని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్ వెల్లడించారు.

Published By: HashtagU Telugu Desk
Hyderabad

Drunk And Drive Telangana Police

కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఐదు జోన్లలో 5819 లైసెన్సులను రోడ్డు రవాణా అథారిటీ (ఆర్‌టీఏ) రద్దు చేసింది. 2021 సంవత్సరంతో పోలిస్తే మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు పాల్పడిన వారి లైసెన్స్‌లు 3,220 ఎక్కువగా ఉన్నాయని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ జోన్‌లలో ఈస్ట్ జోన్ మినహా అన్ని జోన్‌లలో లైసెన్సులు భారీగా రద్దు చేయబడ్డాయి. నార్త్ జోన్‌లో 1103, సౌత్‌లో 1151, వెస్ట్‌లో 1345, ఈస్ట్ జోన్‌లో 510 లైసెన్స్‌లు రద్దయ్యాయి.

  Last Updated: 01 Jan 2023, 03:07 PM IST