Hyderabad: ఖైరతాబాద్ గణేష్ వద్ద మహిళలను వేధించిన 55 మంది పోకిరీలు అరెస్ట్

ఖైరతాబాద్ గణేష్ వద్ద రోజుకి వేలాది మంది భక్తులు వస్తూ పోతుంటారు. ఇందులో మహిళా భక్తులు కూడా ఉంటారు. అయితే గుంపులో మహిళలను కొందరు పోకిరీలు వేధింపులకు పాల్పడుతున్నారు

Hyderabad: ఖైరతాబాద్ గణేష్ వద్ద రోజుకి వేలాది మంది భక్తులు వస్తూ పోతుంటారు. ఇందులో మహిళా భక్తులు కూడా ఉంటారు. అయితే గుంపులో మహిళలను కొందరు పోకిరీలు వేధింపులకు పాల్పడుతున్నారు. నలుగురిలో మనం ఏం చేసినా నడుస్తుందనుకుని ఒంటరిగా వచ్చిన మహిళలను టార్గెట్ చేస్తున్నారు. కొందరు పోకిరీలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో గత మూడురోజులు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద 55 మందిని హైదరాబాద్ పోలీసుల షీ టీమ్స్ అరెస్ట్ చేసింది.

అశ్లీల చర్యలు, అనుచితంగా తాకడం లేదా మహిళలను వెంబడించడం వంటి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను కూడా షీ టీమ్‌లు సేకరించాయి. 3 రోజుల వ్యవధిలో 55 మంది వ్యక్తులను వీడియో ఆధారాలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక్కడ మహిళలు భక్తి కార్యక్రమాలలో మునిగిపోతారు. క్యూలలో ఉండాల్సి వస్తుంది. ఇదే అదునుగా కొందరు ప్రవర్తిస్తున్నారు. నేరస్థులు ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగులతో సహా వివిధ వృత్తుల వారున్నట్టు షీటీమ్స్ చెప్తున్నాయి. అనుచితంగా తాకడం, అసభ్యకర వ్యాఖ్యలు, సైగలు చేస్తూ మహిళలకు ఇబ్బంది కలిగించినందుకు వారిని అరెస్ట్ చేసినట్టు షీటీమ్స్ పేర్కొన్నాయి. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, కోర్టులో హాజరుపర్చుతామని తెలిపారు.

Also Read: Rajamouli : తను తీసిన సినిమాల్లో రాజమౌళి ఫేవరెట్ మూవీ ఏది..?