Site icon HashtagU Telugu

CM KCR : 16 రోజులు 54 స్థానాలు.. సుడిగాలి పర్యటనలకు కేసీఆర్ రెడీ

Kcr Says Asara Pension Will Be Given Rs 5000 After March

Kcr Says Asara Pension Will Be Given Rs 5000 After March

CM KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తయిన తరుణంలో రెండో విడత ప్రచారానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈదఫా ఆయన 16 రోజుల్లో 54 నియోజకవర్గాలను చుట్టేయబోతున్నారు. రోజూ వివిధ నియోజకవర్గాల పరిధిలో కనీసం 3 నుంచి 4 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. పోలింగ్‌కు మరో 17 రోజుల టైమే ఉన్న తరుణంలో చేయబోతున్న రెండోవిడత ప్రచారాన్ని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఓటర్లను ఎంతలా ఆకర్షిస్తే, అంతలా మళ్లీ విజయం దక్కే అవకాశాలు ఉంటాయి. నవంబర్ 30న పోలింగ్ ఉన్నప్పటికీ.. నవంబర్ 28తోనే ప్రచారం ముగుస్తుంది. అందుకే కేసీఆర్ ఈ 16 రోజుల్లో గ్యాప్ లేకుండా ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నందున బీఆర్ఎస్ పార్టీ సభలకు ప్రజా ఆశీర్వాద సభలుగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈదఫా ఓ వైపు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌కు పోటీ పెరిగింది. మరోవైపు సీఎం కేసీఆర్ గజ్వేల్‌తోపాటూ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. ఫలితంగా కేసీఆర్‌పై ఒత్తిడి పెరిగింది.ఈ ఒత్తిడిని మేనేజ్ చేస్తూనే.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే సంకల్పంతో సుడిగాలి పర్యటనలకు గులాబీ బాస్ సమాయత్తం అవుతున్నారు. ఇవాళ బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.

We’re now on WhatsApp. Click to Join.

కేసీఆర్ ప్రచార షెడ్యూల్ 

  • నవంబర్ 13 – దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట
  • నవంబర్ 14 – పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం
  • నవంబర్ 15 – బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్
  • నవంబర్ 16 – ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్
  • నవంబర్ 17 – కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల
  • నవంబర్ 18 – చేర్యాల
  • నవంబర్ 19 – అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి
  • నవంబర్ 20 – మానకొండూరు, స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ
  • నవంబర్ 21 – మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట
  • నవంబర్ 22 – తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి
  • నవంబర్ 23 – మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్‌చెరు
  • నవంబర్ 24 – మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి
  • నవంబర్ 25 – హైదరాబాద్‌
  • నవంబర్ 26 – ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక
  • నవంబర్ 27 – షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి
  • నవంబర్ 28 – వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, గజ్వేల్‌

Also Read: India Victory : నెదర్లాండ్స్‌పై టీమిండియా విక్టరీ.. సెమీస్‌లో కివీస్‌తో ఢీ