Hyderabad: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. 53 లక్షల్లో మోసం!

అవగాహన రాహిత్యంతో లక్షలు, కోట్లు మోసపోయిన హైదరాబాద్ ప్రజలు.. మళ్లీ సైబర్ మోసాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

  • Written By:
  • Updated On - July 11, 2023 / 12:31 PM IST

వాట్సాప్, సోషల్ మీడియా, ఫేస్ బుక్ వాడకం ఎప్పుడైతే ఎక్కువైందో, అప్పట్నుంచే మోసాలు చేసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అవగాహన రాహిత్యంతో లక్షలు, కోట్లు మోసపోయిన హైదరాబాద్ ప్రజలు.. మళ్లీ సైబర్ మోసాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగాల పేరుతోనో, అధిక డబ్బుతో ఆశ చూపుతునో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఒకే రోజు ఇద్దరు ఈ తరహా ఆన్ లైన్ మోసానికి బలయ్యారు.

వీళ్ల నుంచి ఏకంగా 53 లక్షల రూపాయలు కొట్టేశారు సైబర్ మోసగాళ్లు. ముందుగా వీళ్లిద్దరికీ లింక్స్ పంపించారు సైబర్ మోసగాళ్లు. వాటిని క్లిక్ చేసి టాస్క్ పూర్తిచేస్తే డబ్బులిస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే నిజంగానే డబ్బులిచ్చారు. దీంతో వీళ్లకు నమ్మకం కుదిరింది. ఆ తర్వాత ఈ ఇద్దరితో విడతలవారీగా పెద్దమొత్తంలో డబ్బు గుంజారు మోసగాళ్లు. ఎంత పెట్టుబడి పెడితే, దానికి రెండింతలు వస్తుందని ఆశ చూపారు. అలా ఓ వ్యక్తి నుంచి 48 లక్షల రూపాయలు, మరో మహిళ నుంచి 5 లక్షలు కాజేశారు. ఆ తర్వాత అన్ని  లింక్స్ కట్ అయిపోయాయి.

ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. దీంతో మోసపోయామని గ్రహించిన వీళ్లిద్దరూ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. హైదరాబాద్ సిటీలో ఇలాంటి కేసులు పెరిగిపోతుండటంతో సైబర్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా అవగాహన నిర్వహిస్తున్నారు. అయినా ప్రజలు సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారని అంటున్నారు. ఆన్ లైన్ లో ఏ పనైనా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని చెప్పారు.

Also Read: Samantha Treatment: హెల్త్ ట్రీట్ మెంట్ కోసం సమంత ఎన్ని కోట్లు ఖర్చుచేస్తోందో తెలుసా?