Breaking: పాలమూరు లిఫ్ట్ పనుల్లో పెను విషాదం.. క్రేన్ వైరు తెగి ఐదుగురు కూలీలు మృతి..!!

పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో పెనువిషాదం నెలకొంది. పనులు చేస్తున్న 5గురు కూలీలు ప్రమాదవశాత్తు ఈ ఉదయం మరణించారు.

Published By: HashtagU Telugu Desk
Crime

Crime

పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో పెనువిషాదం నెలకొంది. పనులు చేస్తున్న 5గురు కూలీలు ప్రమాదవశాత్తు ఈ ఉదయం మరణించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లపూర్ మండలం రేగుమనగడ్డ దగ్గర ఈ తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది.

రంగారెడ్డి ప్యాకేజీ-1లో పనులు చేస్తుండగా కూలీలు పంప్ హౌజ్ లోకి దిగారు. ఈ సమయంలో క్రేన్ వైర్ తెగిపోయింది. దీంతోకూలీలు కిందపడి మరణించారు. ఈ ఘటనలో మరో కూలీకి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులంతా బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు.

  Last Updated: 29 Jul 2022, 10:02 AM IST