Site icon HashtagU Telugu

KTR : తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేసింది ‘వాల్మీకి స్కాం’ డబ్బులే.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

Ktr Valmiki Scam

KTR : కర్ణాటక రాష్ట్రంలో జరిగిన వాల్మీకి స్కాంపై  బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ స్కాం కర్ణాటక కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా ముచ్చెమటలు పట్టిస్తుందని ఆయన ఆరోపించారు. అయితే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఈ విషయం బయటకు రాకుండా ఆపుతున్నారని, ఆ మబ్బులు నాలుగు రోజుల్లో వెళ్లిపోతాయని వ్యాఖ్యానించారు. ఈమేరకు కామెంట్స్‌తో కేటీఆర్ ఆదివారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రభుత్వానికి చెందిన రూ.180 కోట్లు దారి మళ్లాయి. ఈవిషయాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్వయంగా కర్ణాటక అసెంబ్లీలో ఒప్పుకున్నారు. హైదరాబాద్‌లోని తొమ్మిది బ్యాంక్ అకౌంటులకు రూ.45 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. దీనిపై విచారణ మొదలు కాగానే వాల్మీకి కార్పొరేషన్ సూపరింటెండెంట్ సూసైడ్ చేసుకున్నారు. బ్యాంకు అధికారులు సహా 11మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుంచి డబ్బు అక్రమంగా తెలంగాణలోని ఏయే అకౌంట్లకు వచ్చింది ? ఆ అకౌంట్లు ఎవరివి ? ’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ఇటీవలే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఈ డబ్బులనే ఖర్చు చేసింది. అందులో దాదాపు నాలుగున్నర కోట్లు  ఓ మీడియా కంపెనీకి కూడా అందాయి. దీనికి  సంబంధించిన ఆధారాలు ఉన్నాయి’’ అని కేటీఆర్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నోరువిప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read :Harish Rao : హైడ్రాతో రాజకీయ హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ : హరీష్‌రావు

‘‘లోక్‌సభ ఎన్నికల టైంలో తెలంగాణలోని బంగారం షాపులు, బార్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. వారికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏమిటో బయలకు రావాలి. సిద్ధ రామయ్యను తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి సతీష్ జార్ఖిహొలీ అంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పెనవేసుకున్న బంధం వాల్మీకి స్కామేనా?’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘వాల్మీకి స్కాంలో భారీ మొత్తంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వాటాలు వచ్చాయని తెలిసినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటోంది. అసలు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు ? ’’ అని ఆయన వీడియో సందేశంలో కామెంట్ చేశారు.

Also Read :Gokul Chat Blasts : గోకుల్‌‌ఛాట్ బాంబు పేలుళ్లకు 17 ఏళ్లు.. ఆనాడు ఏం జరిగిందంటే..