Site icon HashtagU Telugu

Telangana: 42ఏళ్లకే ఆసరా పెన్షన్..ఎమ్మెల్యే ఆగ్రహం..!!

IT raids telangana

money

వృద్ధాప్యంలో ఆసరా లేని నిరుపేదలకు ఆసరా పెన్షన్లు ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 60ఏళ్ల పైబడిన వారికి పింఛన్లు ఇవ్వగా..ఇప్పుడు అది 57ఏళ్లకు కుదించారు. కానీ ఈ ఆసరా పెన్షన్లు చాలా ప్రాంతాల్లో పక్కదారి పడుతున్నాయి. అనర్హులు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. 50ఏళ్లు నిండని వారు కూడా పెన్షన్స్ తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల 65ఏళ్లు నిండినా వారికి పెన్షన్ అందడం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేటలో 50ఏళ్లు లేని ఓ వ్యక్తికి ఆసరా పెన్షన్ ఇస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనర్హుడికి పెన్షన్ మంజూరు అవ్వడంపై ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ పొందేందుకు సరిపడా వయస్సు లేని వ్యక్తిని లబ్దిదారుడిగా ఎలా ఎంపిక చేశారంటూ అధికారులు మండిపడ్డారు.

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో కొత్తగా మంజూరు అయిన పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. పెన్షన్ పత్రాలు పంపిణీ చేస్తున్న సమయంలో మల్లేశ్ అనే వ్యక్తి అక్కడి వచ్చాడు. అతడిని చూసిన ఎమ్మెల్యే షాక్ అయ్యారు. సరిగ్గా 50ఏళ్లు కూడా లేవు…పెన్షన్ ఎలా మంజూరు అయ్యింది. అంటూ ఆరాతీశారు. ఆధార్ కార్డు పరిశీలిస్తే…61 సంవత్సరాల వయస్సు ఉంది. ఆ వ్యక్తి 42 ఏళ్ల వయస్సుంటుంది. 61 ఏళ్లని ఆధార్ కార్డుపై నమోదవ్వడం ఏంటని అధికారులను నిలదీశారు ఎమ్మెల్యే.

Exit mobile version