Site icon HashtagU Telugu

PM Security in Hyderabad: 4000 మందితో ప్రధాని మోడీకి పోలీసు భద్రత

Bjp Meet

Bjp Meet

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో పర్యటించనున్నారు. నగరంలో 28 నుంచి 30 గంటల పాటు గడపనున్నారు. 2వ తేదీన మోడీ సారథ్యంలో హైటెక్స్‌లోని నోవాటెల్‌ హోటల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 3వ తేదీన సాయంత్రం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగే “విజయ సంకల్ప సభ”లో మోడీ పాల్గొంటారు. ఈనేపథ్యంలో ప్రధాని మోడీకి తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన మూడు అంచెల భద్రత కల్పించనున్నారు. శుక్రవారం నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పరేడ్‌ గ్రౌండ్స్‌ సభ తర్వాత(ఈ నెల 3న రాత్రి) రాజ్‌ భవన్‌లో ప్రధాని బస చేస్తారని నగర కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.రాజ్‌భవన్‌లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.బీజేపీ నేతలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్‌లో భద్రత ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. హెచ్‌ఐసీసీ, బేగంపేట, రాజ్‌భవన్‌ మార్గాల్లో 4వేల మంది, పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో 3 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హెచ్‌ఐసీసీకి 5 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్, నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. 4 రోజుల పాటు పూర్తిగా పోలీసుల నిఘాలో హెచ్‌ఐసీసీ ఉండనుంది. కేవలం బీజేపీ అనుమతించిన ప్రతినిధులనే హెచ్ఐసీసీలోకి అనుమతించనున్నారు.

మోడీ టూర్ ఇలా..

* ప్రధాని మోదీ జులై 2న మధ్యాహ్నం 2.55కి గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
* ప్రత్యేక హెలికాప్టర్‌లో అక్కడి నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు.
* సాయంతం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ.
* జులై 3న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సమావేశాల్లో ప్రధాని పాల్గొంటారు.
* జులై 3న సాయంత్రం 6.30 పరేడ్ గ్రౌండ్స్‌ సభకు చేరుకుంటారు. 6.30 నుంచి 7.30 వరకు సభలో ఉంటారు.
* జులై 4న ఉదయం 9.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు.

Exit mobile version