Dogs Killed: తెలంగాణలోని రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. మనుషులతో పాటు మూగ జీవాలు సైతం కుక్క కాటు బారిన పడుతున్నాయి. అయితే వీధి కుక్కల బెడదను తట్టుకోలేని కొంతమంది వాటిపై దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని జగిత్యాల జిల్లా మైతాపూర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 40 కుక్కలను కర్రలతో కొట్టి చంపేశారు. దీంతో నిందితుల కోసం రాయికల్ పోలీసులు వెతుకుతున్నారు.
ఈ ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన అదులాపురం గౌతమ్ అనే జంతు కార్యకర్త సోమవారం ఫిర్యాదు చేశారు. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960లోని సెక్షన్ 11(1) కింద వారు కేసు నమోదు చేశారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, వీధి కుక్కల కోసం గర్భనిరోధక చర్యలను ప్రారంభించేలా స్థానిక సంస్థలను ఒప్పించాలని గౌతమ్ అన్నారు. వీధి కుక్కల సంచారం ఉంటే సమాచారం అందించాలని సూచించారు.
Also Read: Niharika Unfollows: భర్తను అన్ ఫాలో చేసిన నిహారిక.. అసలు మ్యాటర్ ఇదే!