ఈ జనరేషన్ పిల్లలు చాలా స్పీడ్ గా ఉన్నారు. పుట్టగానే తమపేరుపై ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటున్నారు.
తాజాగా అద్విత్ అనే నాలుగేళ్ల పిల్లోడు ఎవరెస్టు బేస్‌క్యాంప్‌ను చేరుకున్నాడు. ఇంత చిన్న వయసులోనే ఈ ఫీట్ సాధించడం పట్ల పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ప్రక్రియతో అద్విత్ మౌంట్ ఎవరెస్టు బేస్ క్యాంప్ చేరుకున్న ఆసియాకి చెందిన అత్యంత చిన్న వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.
అద్విత్ తల్లి శ్వేతా గోలేచా గత పదేళ్లుగా ట్రెక్కింగ్ చేస్తున్నారట. 2017లో తాను గర్భవతిగా ఉన్న సమయంలో బేస్ క్యాంప్‌కు వచ్చారట. తన కడుపులోని బిడ్డ ఎవరెస్టు వద్ద రికార్డు నెలకొల్పాలని అనుకోని, అద్విత్ పుట్టిన తర్వాత అతడిని ఆ లక్ష్యందిశగా సిద్ధంచేస్తూ వచ్చింది. తన తల్లి, మేన మామ సౌరభ్‌తో సుఖానితో కలిసి అద్విత్ అక్టోబర్ 28న పర్వతారోహణ ప్రారంభించి, నవంబర్ 6న 5,364 మీటర్ల ఎత్తును చేరుకున్నాడు.
స్వతహాగా ట్రెక్కింగ్ అలవాటున్న
అద్విత్ తల్లి శ్వేత తన కుమారుడికి చిన్న వయసులో ఇంటివద్దే శిక్షణ ఇచ్చిందట. అబుదాబిలో అద్విత్ వాళ్ళ ఇల్లు 15వ అంతస్తులో ఉండేదట. తన కుమారుడిని 15 అంతస్తులు మెట్లపై కాలినడకన ఎక్కించడం అలవాటు చేయడం వల్ల ఎత్తులపై నడవటం అలవాటు అయిందని, ఎవరెస్టు ఎక్కడానికి ఆ ప్రాక్టీస్ ఎంతో ఉపయోగపడిందని అద్విత్ తల్లి శ్వేత తెలిపారు. గతంలో 195 దేశాల జెండాలను చూసి రాజధానులను గుర్తించిన అతిపిన్న వయస్కుడిగాను అద్విత్ రికార్డు సృష్టించాడట.