Site icon HashtagU Telugu

Congress Govt : 14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి – హరీశ్ రావు

Harishrao Cng

Harishrao Cng

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) 14 నెలల పాలనలో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ప్రాజెక్టులు నాశనమయ్యాయని BRS ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులను కాపాడలేకపోతే, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ముఖ్యంగా కృష్ణా నదికి సంబంధించిన జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుంటున్నా, తెలంగాణ ప్రభుత్వం నిశ్చలంగా ఉందని విమర్శించారు. గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పటికీ, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు మందగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

AP Budget 2025 -26 : 3 లక్షల కోట్లతో పద్దు..?

ఇక ఎస్ఎల్‌బీసీ (SLBC) ఘటన జరిగిన ఆరు రోజులైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్కడకు రాలేదని, ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపారు. ప్రజా ప్రతినిధులైన తమను టన్నెల్‌లోకి అనుమతించకపోవడం దారుణమని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమన్వయ లోపంతో సహాయక చర్యల్లో విఫలమైందని, ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారం ముఖ్యమా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

Anita Anand: కెన‌డా ప్ర‌ధాని రేసులో భార‌త సంత‌తికి చెందిన మ‌హిళ‌.. ఎవ‌రీ అనితా ఆనంద్‌?

ప్రమాదం జరిగిన ఆరు రోజుల తర్వాత కూడా కేవలం తట్టెడు మట్టిని మాత్రమే తీసిన ప్రభుత్వ విధానం దారుణమని హరీశ్ రావు విమర్శించారు. మంత్రులు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తూ, ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను టూరిస్ట్ ప్లేస్‌లా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, నిర్లక్ష్యం వల్ల 15 నెలల పాలనలో నాలుగు ప్రాజెక్టులు నాశనమయ్యాయని, ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.