Site icon HashtagU Telugu

Protest Against Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు.. ఎస్సై స‌హా న‌లుగురికి…?

Protesthyd Imresizer

Protesthyd Imresizer

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఎస్సై సహా నలుగురు గాయపడ్డారు. మహ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు రాత్రంతా అనేక ర్యాలీలు నిర్వహించారు. గోషామహల్‌కు చేరుకోవడానికి ప్రయత్నించిన కొద్దిమంది ముస్లిం నిరసనకారుల‌పై పోలీసులు లాఠీ ఛార్జీ చేసిన‌ట్లు స‌మాచారం.

హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన రాజా సింగ్‌కు మంగళవారం బెయిల్ రావడంతో నిరసనలు చెలరేగాయి. ఓల్డ్ సిటీలో బుధవారం రాత్రి అంతటా ముస్లిం యువకుల నిరసన ర్యాలీలు కొనసాగించాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కొందరు గోషామహల్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వ్‌కు చెందిన పోలీసులు భారీగా మోహ‌రించారు. రాజా సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆందోళనకారులు రెండు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. జంక్షన్‌లోని రాజేష్‌ మెడికల్‌ హాల్‌ సమీపంలోని శాలిబండలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పలు చోట్ల రాజాసింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.