Balka Suman: 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారు: బాల్క సుమన్

  • Written By:
  • Updated On - February 19, 2024 / 11:21 PM IST

గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థిని లు ఆత్మహత్య లు చేసుకున్నారని, ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.అక్కడ ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తున్న మంత్రులు,ఎమ్మెల్యేలు పట్టించు కోవడం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. యూట్యూబ్ ఛానెల్ లు,మేధావులకు ఈ విద్యార్థినీ ల ఆత్మహత్య లు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. మేధావులు స్పందించాలని,  తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా అన్నారు.

‘‘ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే.. రాష్ట్రంలో సమస్యలు లేనట్టు ఢిల్లీ కి చెక్కర్లు కొడుతున్నారు. రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ మాత్రమే అమలు చేశారు అది మహిళకు ఉచిత బస్ ప్రయాణం చాలా గ్రామాలకు బస్ సౌకర్యాలు లేవు. ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ కి పోతున్నాడు డబ్బు సంచులు మోసుకుపోతున్నాడు. ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ కు డబ్బు సంచులు మోస్తున్నాడు. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇస్తున్నాడు’’ అని సుమన్ అన్నారు.

‘‘ఎన్నికల షెడ్యూల్ ఎంత తొందర వస్తే అంత మేలు అన్నట్లు చూస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. రోజు వచ్చే టప్పుడు పెద్దమ్మ తల్లికి ఎన్నికల షెడ్యూల్ తొందరగా రావాలని అద్దం దించి మొక్కుతున్నాడు అంట ఎందుకంటే షెడ్యూల్ వస్తే హామీలు ఎగకోటవచ్చు అని చూస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక్క మేడి గడ్డ డ్యామ్ ను బూచిగా చూపెట్టి పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క 3 ఫిల్లర్లు కుంగాయి.అయితే వాటిని పునరుద్ధరణ పనులు చేయకుండా.. నాటి మా ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు’’ అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.