Site icon HashtagU Telugu

4 Cases – Azharuddin : అజారుద్దీన్ భవితవ్యం తేలేది నేడే.. కాసేపట్లో మల్కాజిగిరి కోర్టు తీర్పు

Azharuddin

Azharuddin

4 Cases – Azharuddin : జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌ భవితవ్యం ఇవాళ తేలనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌(HCA)కు సంబంధించిన అవినీతి ఆరోపణల్లో అజారుద్దీన్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి. అవన్నీ నాన్‌బెయిలబుల్ కేసులు కావడంతో ముందస్తు బెయిల్ కోసం మల్కాజిగిరి కోర్టులో అజారుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. ఈరోజు ఇంకాసేపట్లో  మల్కాజ్‌గిరి కోర్టు తీర్పు ఇవ్వనుంది. బెయిల్ మంజూరయ్యాక, జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా అజారుద్దీన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

HCAలో టెండర్ల పేరుతో థర్డ్ పార్టీ సంస్థకు పనులను కేటాయించి, దానికి నిధులను మంజూరు చేశారని అజారుద్దీన్‌పై కేసు నమోదైంది. 2020 నుంచి 2023 వరకు HCA నిధుల కేటాయింపు, చెల్లింపులలో అజార్ అవకతవకలకు పాల్పడ్డారని  ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. ఆగస్ట్ 10న ఈ వ్యవహారంపై జస్టిస్  నాగేశ్వర్‌రావు కమిటీ ఆడిట్ నిర్వహించింది. క్రికెట్ బాల్స్ కొనుగోలులో భారీ గోల్‌మాల్ చేసినట్లు గుర్తించింది. ఒక్కో బాల్‌ను 392 రూపాయలకు బదులు 1400 రూపాయలకు  వర్క్ ఆర్డర్ చేసినట్లు గుర్తించింది. క్రికెట్ బాల్స్ కొనుగోలు పేరుతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు రూ.57 లక్షలు నష్టం జరిగినట్లు ఆడిట్‌లో వెల్లడైంది. బకెట్ చైర్స్ కొనుగోలులోనూ HCAకు రూ.43 లక్షలు నష్టం వాటిల్లినట్లు కమిటీ తెలిపింది.HCAకు ఫైర్  ఫైటింగ్ పరికరాల వ్యవహారంలో రూ.1.50 కోట్ల నష్టం, జిమ్ పరికరాల పేరుతో రూ.1.53 కోట్ల నష్టం జరిగిందని వివరించింది. ఈనేపథ్యంలో జస్టిస్ నాగేశ్వర్‌రావు కమిటీ నివేదికను అనుసరించి అజారుద్దీన్‌పై ఉప్పల్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసినప్పటి నుంచి అజారుద్దీన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మల్కాజిగిరి కోర్టులో అజారుద్దీన్ పిటిషన్(4 Cases – Azharuddin) వేశారు.

Also Read:Hyderabad: రెయిన్ అలర్ట్, తెలంగాణలో ఐదురోజుల పాటు వర్షాలు!