Junior Lineman Jobs : తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో త్వరలోనే జాబ్ రిక్రూట్‌మెంట్ జరగబోతోంది. దాదాపు 3,500 జూనియర్ లైన్‌మన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటితో మరిన్ని ఇతర విభాగాల ఖాళీలను కూడా భర్తీ చేయబోతున్నారని సమాచారం. జాబ్ నోటిఫికేషన్ వెలువడితేనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడి అవుతాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్), వరంగల్ కేంద్రంగా పనిచేసే ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎన్‌ఎస్పీడీసీఎల్)లలో దాదాపు 3,500 జూనియర్ లైన్‌మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంటున్నారు.
Also Read :IRCTC Train Tickets : ట్రైన్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్.. కొత్త రూల్ తెలుసుకోండి
వీటిలో దాదాపు 1,550 జూనియర్ లైన్‌మెన్ పోస్టులు టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోనే ఉన్నాయని తెలిసింది. వీటిలో దాదాపు 550 పోస్టులకు ఎంపికయ్యే వారికి హైదరాబాద్ సిటీ పరిధిలోనే పోస్టింగ్‌లు కేటాయించనున్నారు. మిగతా పోస్టులన్నీ టీఎన్‌ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నాయి. మహిళలు సైతం జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దాదాపు 50 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు కూడా టీజీఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ విడుదల చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ల కోసం రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆతుర్తగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరులోగా తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలు(Junior Lineman Jobs) జాాబ్ నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణపై క్లారిటీ వచ్చిన తర్వాతే ఈ జాబ్ నోటిఫికేషన్ల విడుదలకు తెలంగాణ సర్కారు అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది.
Also Read :Bathukamma Sarees : మహిళలకు బతుకమ్మ చీరలను మించిన ప్రయోజనాలు : సీతక్క
ఐటీఐతో హైదరాబాద్‌లో జాబ్స్
హైదరాబాద్ నగరంలోని కంచన్‌బాగ్‌లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI)లో 31 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ జాబితాలో 13 అసిస్టెంట్ (మెటలర్జీ) పోస్టులు, 2 అసిస్టెంట్ (మెకానికల్) పోస్టులు, 9 అసిస్టెంట్ (ఫిట్టర్) పోస్టులు, 4 అసిస్టెంట్ (వెల్డర్) పోస్టులు, 3 అసిస్టెంట్ (డ్రైవర్) పోస్టులు ఉన్నాయి. ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. టెన్త్ క్లాస్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత, ఎల్‌ఎంవీ/ హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు పని అనుభవం ఉన్నవారిని ఈ జాబ్స్‌కు ఎంపిక చేస్తారు. వాక్ ఇన్ తేదీలు ఈ నెల 28, 29, నవంబర్ 25, 26, 27.