Site icon HashtagU Telugu

Farmhouse Raids: హైదరాబాద్ ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలు.. ఏం జరుగుతుందంటే!

Farm House

Farm House

నగర శివార్లలో (Hyderabad) అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు, జూదం, అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న 32 ఫామ్‌హౌస్‌లపై సైబరాబాద్ పోలీసుల సమన్వయంతో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌లు (ఎస్‌ఓటీ) దాడులు నిర్వహించాయి. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గత వారాంతం, సోమవారం 32 చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాటిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై (Rave parties) కేసులు నమోదు చేశారు. మొయినాబాద్‌లోని బిగ్ బాస్ ఫామ్‌హౌస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ, శంషాబాద్‌లోని రిప్లెజ్ ఫామ్‌హౌస్, మేడ్చల్‌లోని గోవర్ధన్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లపై దాడులు జరిగినట్లు సమాచారం.

ఈ ఫామ్‌హౌస్‌ల (Farmhouse)  నుంచి 29 మద్యం సీసాలు, హుక్కా మెటీరియల్‌, లక్ష నగదు, 10 సెట్ల ప్లే కార్డులు, ఏడు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో ముంబైకు చెందిన కాల్ గర్ల్స్ ను పట్టుకున్నట్టు తెలుస్తోంది. నగరానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసి ఫామ్ హౌస్ లను ఏర్పాటు చేసుకున్నారు. బడా బాబులకు సంబంధించిన ఫామ్ హౌస్ లు కావడంతో అక్కడ ఏం జరుగుతుందనే విషయం బయటకు పొక్కడం లేదు. పలు ఫామ్ హౌస్ (Farmhouse ) లలో రేవ్ పార్టీలు, మద్యం, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఫామ్ హౌస్ (Farmhouse)  లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దాడులు చేస్తే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రజలు కోరుతున్నారు.

Also Read: Rashmika Mandanna: పెట్ డాగ్ తో రష్మిక వాలంటైన్ సెలబ్రేషన్స్.. విజయ్ ఎక్కడ అంటూ ట్రోల్స్!