Site icon HashtagU Telugu

TGSRTC : 3,035 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGSRTC

TGSRTC

తెలంగాణ రాష్ట్ర సర్కార్ TGSRTCలో 3,035 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం తో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్‌, 743 శ్రామిక్‌, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌(మెకానిక్‌), 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌(ట్రాఫిక్‌), 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, 23 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌), 15 అసిస్టెంట్‌ మెకానికల్ ఇంజనీర్‌, 11 సెక్షన్‌ ఆఫీసర్‌(సివిల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(జనరల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(స్పెషాలిస్ట్‌) కొలువులు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె గ్రూప్‌ 2, 3 పోస్టులు పెంచాలంటూ ఈరోజు ఉదయం టీజీపీఎస్సీ (TGPSC) వద్ద ఆందోళన చేపట్టారు ఏబీవీపీ నాయకులు. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కి 1:100 పిలువాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల సంఖ్య పెంచే వరకు ఉద్యమిస్తామని ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ స్పష్టం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రూప్‌-2, 3తోపాటు ఉపాధ్యాయ పోస్టులు చాలావరకు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఏబీవీపీ ముట్టడి నేపథ్యంలో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున పోలీసులు మోహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ మోతీలాల్‌నాయక్‌ (Motilal Nayak) దీక్ష విరమించారు. తొమ్మిదిరోజులుగా గాంధీ హాస్పటల్ లో దీక్ష చేస్తున్న ఆయన నిరుద్యోగుల కోరికమేరకు కొబ్బరినీళ్లు తాగి దీక్ష విరమించానన్నారు.

Read Also : CM Chandrababu: ఇసుక మాఫియా సీఎం గురి

Exit mobile version