Bank Jobs : బ్యాంకు జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 50 పోస్టులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. తమిళనాడు/ పుదుచ్చేరిలలో అత్యధికంగా 160 పోస్టులు ఉన్నాయి. మహారాష్ట్రలో 40 పోస్టులు, కర్ణాటకలో 35 పోస్టులు, గుజరాత్‌లో 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పాసై 20 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగినవారు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు సెప్టెంబర్ 2 వరకు https://www.indianbank.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.1000. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు అప్లికేషన్ ఫీజు రూ.175 మాత్రమే.రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు(Bank Jobs) ఎంపిక చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join
రాతపరీక్ష విషయానికొస్తే.. అందులో మొత్తం 155 ప్రశ్నలు ఉంటాయి. వాటికి మొత్తం 200 మార్కులను కేటాయిస్తారు. 180 నిమిషాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 45 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 60 మార్కులు ఉంటాయి. డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్‌కు 35 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 60 మార్కులు కేటాయిస్తారు. ఇక జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ విభాగాల నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 40 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగం నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 40 మార్కులు ఉంటాయి.
శాలరీ, ఇతర ప్రయోజనాలివీ..
ఇండియన్ బ్యాంక్‌లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికయ్యే వారికి ప్రతినెలా రూ.48,480 నుంచి రూ.85,920 వరకు పే స్కేల్ లభిస్తుంది. దీనికి అదనంగా డీఏ, సీసీఏ, హెచ్‌ఆర్‌ఏ/ లీజ్డ్ అకామడేషన్, లీవ్ ఫేర్ కన్సిషన్, మెడికల్ ఎయిడ్, హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు. ప్రభుత్వరంగ బ్యాంకు కావడంతో ఇందులో ఉద్యోగి డెవలప్‌మెంటుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరుతున్నందున భవిష్యత్తులో సీనియర్ బ్యాంకింగ్ ఆఫీసర్లుగా ఎదిగే అవకాశం దక్కుతుంది.