Wild Life: వేటగాళ్ల చేతిలో చిక్కుతున్న పులులు..

మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తప్పిపోయిన పులులు వేటగాళ్ల చేతికి చిక్కుతున్నాయి

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:15 PM IST

హైదరాబాద్: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తప్పిపోయిన పులులు వేటగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. తెలంగాణలో తాజగా మూడు పులులు వేటగాళ్ల చేతిలో బలూయ్యాయి.కవాల్లోని టైగర్ కారిడార్ ప్రాంతం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులు వేటగాళ్లకు అడ్డాగామారాయి. అయితే అడవి నుంచి తప్పిపోయిన పులులపై అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని జంతుప్రేమికులు ఆరోపిస్తున్నారు. టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టిపిఎఫ్)ని 2019లో ప్రతిపాదించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

2021లో భారతదేశంలో నమోదైన 103 పులుల మరణాల్లో తెలంగాణలో మూడు ఉన్నాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ప్రకారం తెలంగాణలో పెద్ద పులుల మరణాలు అటవీప్రాంతం బయట సంభవించాయని పేర్కొంది. అక్టోబరు 30న కాగజ్నగర్లో కొట్నాక దేవ్రావు, గొడుగు అవినాష్ అనే ఇద్దరు వేటగాళ్లు పులి చర్మంతో పట్టుబడ్డారు.ఇంద్రవెల్లి ప్రాంతంలో సంచరించిన ఒక పులి ఏడాది నుంచి కనిపించడంలేదు. ఆ పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్కు చెందిన పులిగా అనుమానిస్తున్నామని రాష్ట్ర వన్యప్రాణి అధికారులు తెలిపారు. ఇంద్రవెల్లి పరిధిలోని పత్తి పొలాల్లో ఆ పులి చిక్కుకుంది. ఆ పులిని గుర్తించేందుకు ఆ ఫోటోలను తిప్పేశ్వర్ DFO కి పంపినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతంలో చాలా పులులు సంచరిస్తున్నాయని… అవి ఇక్కడ నివాస పులులు కావని … మహారాష్ట్ర నుంచి వచ్చాయని సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి సిధానంద్ కుక్రేటి తెలిపారు.ఇంద్రవెల్లి, కాగజ్నగర్ ప్రాంతాల్లో 29 గ్రామాలుండగా, అడవి జంతువులను చాలా మంది వేటాడే అవకాశం ఉంది. తమ పొలాలను రక్షించుకోవడానికి, స్థానికులు అడవి పందుల కోసం వలలు వేస్తారని సిధానంద్ తెలిపారు.

ఛత్తీస్గఢ్ సరిహద్దులో మూడో పులి మృతి చెందిందని, నిందితులను పోలీసులు అరెస్టు చేశారని ఆయన చెప్పారు. అటవీ అధికారుల వాదనలు ఎలా ఉన్నప్పటికీ, పులులను వేటాడడం బాగా వ్యవస్థీకృతమైన చర్య అని ఫారెస్ట్స్ అండ్ వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీకి చెందిన మీర్జా కరీం బేగ్ చెప్పారు. వేటగాళ్లకు పులి సంచారం గురించి బాగా తెలుసని.. దానిని వేటాడేందుకు ఉచ్చులు వేస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే టీపీఎఫ్ని ఏర్పాటు చేసి అమరాబాద్, కావల్ టైగర్ రిజర్వ్లు, కారిడార్లలో మోహరించాలన్నారు. అయితే వేటగాళ్ల కదలికలపై నిఘా ఉంచేందుకు నాకాబందీ నిర్వహిస్తున్నట్లు కవాల్ టైగర్ రిజర్వ్ అధికారులు తెలిపారు.