తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీరు నిల్వ చేయకపోయినా పంటలకు నీరు అందించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ (MInister Uttam Kumar) రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ బ్యారేజీలు కూలిన తర్వాత కూడా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడకుండానే పంటలకు నీరు అందించే సామర్థ్యం ఉందని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.
Ram Charan Met CM: సీఎం సిద్ధరామయ్యను కలిసిన రామ్ చరణ్.. వీడియో వైరల్!
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ. 87,449 కోట్లు ఖర్చు చేస్తే, అందులో రూ. 21 వేల కోట్లతో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పూర్తిగా నిరుపయోగంగా మారాయని మంత్రి విమర్శించారు. ఈ బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి ఇంత నష్టం కలిగించినా, తాము ఎక్కడా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించలేదని, పారదర్శకంగా విచారణ చేయించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంపై నిజాయితీగా వ్యవహరిస్తోందని, తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఉత్తమ్ సమర్థించుకున్నారు. అయితే, ఈ బ్యారేజీల వల్ల జరిగిన నష్టం, వాటి భవిష్యత్తుపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుల పునరుద్ధరణకు, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండటానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ అంశంపై భవిష్యత్తులో మరింత లోతైన చర్చ జరగవచ్చని భావిస్తున్నారు.