Covid : గురుకులలో కరోనా కలకలం.. 28 విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్!

తెలంగాణలోని ఖమ్మం జిల్లా, వైరాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం 28 మంది బాలికలకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. వైరస్ వ్యాప్తి గురించి తెలుసుకున్న పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని

  • Written By:
  • Updated On - November 22, 2021 / 12:32 PM IST

తెలంగాణలోని ఖమ్మం జిల్లా, వైరాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం 28 మంది బాలికలకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. వైరస్ వ్యాప్తి గురించి తెలుసుకున్న పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తమ బాలికలను ఇంటికి పంపాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులతో పాటు పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులందరికీ సామూహిక కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రెసిడెన్షియల్ పాఠశాలలో 575 మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా వైద్యాధికారులకు ఫోన్ చేసి పాజిటివ్‌గా తేలిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అధునాతన ఆరోగ్య సంరక్షణ అందించాలని, ఈ ప్రాంతంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఏపీ, తెలంగాణలో స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. రెండు రాష్ట్రాల్లోని పాఠశాలలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తెలంగాణలో స్కూల్స్ ప్రారంభమై మూడు రోజులు కూడా గడవకముందే కరోనా కలకలం సృష్టిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఎర్రగట్ల మండలం తాళ్లరాంపూర్ ప్రాథమకి పాఠశాలలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ విద్యార్థికి, స్కూల్ సిబ్బందికి పాజిటివ్ గా తేలింది. దీంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులకు కూడా వైద్య అధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమె క్లాస్ అటెండ్ అయిన విద్యార్థులందరికీ స్కూల్ సిబ్బంది ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు.టీచర్లు, విద్యార్థులకు కరోనా సోకుతుండటంతో తల్లిదండ్రులు వణికిపోతున్నారు. పిల్లలను స్కూల్స్ కు పంపాలంటేనే భయపడుతున్నారు.

కాగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. పెరగడమూ లేదు. కేసులు స్థిరంగా ఉన్నాయి. తెలంగాణలో ఆదివారం 24 గంటల్లో 103 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3575 యాక్టివ్ కేసులు ఉన్నాయని హెల్త్ డిపార్ట్ మెంట్ బులిటెన్ రిలీజ్ చేసింది.