Ramagundam Fertilizers : లక్షన్నర దాకా శాలరీ.. రామగుండం ఫెర్టిలైజర్స్‌లో 27 జాబ్స్

Ramagundam Fertilizers : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)కు నోయిడాలో కార్పొరేట్ ఆఫీసు ఉంది.

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 11:37 AM IST

Ramagundam Fertilizers : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)కు నోయిడాలో కార్పొరేట్ ఆఫీసు ఉంది. ఆ ఆఫీసులో రెగ్యులర్‌ ప్రాతిపదికన 27 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ మార్చి 2న ప్రారంభంకాగా.. మార్చి 31 వరకు ఆన్‌లైన్‌‌లో అప్లికేషన్లను సమర్పించవచ్చు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత హార్డ్ కాపీలను నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల హార్డ్‌కాపీలను నోయిడాలోని ఆర్ఎఫ్‌సీఎల్(Ramagundam Fertilizers) కార్పొరేట్ ఆఫీసు చిరునామాకు పంపాలి. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటున్నారో దాని పేరు దరఖాస్తు పంపే కవరు మీద రాయాల్సి ఉంటుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్ – ఐ/సీ పేరిట ఈ అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు హార్డ్ కాపీని పోస్టులో పంపేందుకు చివరితేదీ ఏప్రిల్ 7.

We’re now on WhatsApp. Click to Join

  • మొత్తం 27 పోస్టులలో  ఇంజినీర్ (ఇ-1) పోస్టులు 19, సీనియర్ కెమిస్ట్ పోస్టులు 02,  అకౌంట్స్ ఆఫీసర్ (ఇ-1) పోస్టులు 05,  మెడికల్ ఆఫీసర్ (ఇ-1) పోస్టు 01 ఉన్నాయి.
  • అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
  • విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఉద్యోగాలకు ఎంపికైనవారిక నెలకు రూ.40,000 – రూ.1,40,000 (రూ.12.99 లక్షల సీటీసీ) వేతనం ఉంటుంది.

Also Read : Balakrishna: శివరాత్రి సందర్భంగా బాలయ్య 109 నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి పునకాలే!

➥ ఇంజినీర్ (ఇ-1) పోస్టులు

కెమికల్ విభాగంలో 11, మెకానికల్ విభాగంలో 05, ఎలక్ట్రికల్ విభాగంలో 02, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో 01 ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్‌, బీఎస్సీ డిగ్రీ పాసైన వారు అప్లై చేయొచ్చు. 31.03.2024 నాటికి 30 సంవత్సరాలలోపు వయసున్న వాళ్లు అప్లై చేయాలి.

➥ సీనియర్ కెమిస్ట్ పోస్టులు

కెమికల్ ల్యాబ్‌లో సీనియర్ కెమిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఎంఎస్సీ (కెమిస్ట్రీ) చేసిన వాళ్లు దీనికి అర్హులు. 31.03.2024 నాటికి 30 సంవత్సరాలలోపు వయసున్న వాళ్లు అప్లై చేయొచ్చు.

➥ అకౌంట్స్ ఆఫీసర్ (ఇ-1) పోస్టులు

ఫైనాన్ష్ & అకౌంట్స్‌ విభాగంలో అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. సీఏ/సీఎంఏ/ఎంబీఏ (ఫైనాన్స్) చేసినవారు దీనికి అర్హులు. 31.03.2024 నాటికి 30 సంవత్సరాలలోపు వయసున్న వారు అప్లై చేయొచ్చు.

➥ మెడికల్ ఆఫీసర్ (ఇ-1) పోస్టులు

మెడికల్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఎంబీబీఎస్ చేసినవారు అప్లై చేయొచ్చు. 31.03.2024 నాటికి 30 సంవత్సరాలలోపు వయసున్న వారు అప్లై చేయొచ్చు.

Also Read :Mahashivratri : మహాశివరాత్రి అంటే ఏమిటి ?.. దాన్ని ఎందుకు జరుపుకుంటారు?