Site icon HashtagU Telugu

TS RTC Buses : ఆర్టీసీ బస్సుల 25,609 ట్రాఫిక్‌ ఉల్లంఘనలు.. రూ.1.84 కోట్ల ఫైన్‌లు

Ts Rtc Buses Traffic Violations Fines On Telangana Rtc Buses

TS RTC Buses : హైదరాబాద్‌లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ భారీగా ఉంటుంది. అదే స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా జరుగుతుంటాయి. ట్రాఫిక్‌ను ఉల్లంఘిస్తున్న జాబితాలో కార్లు, ద్విచక్రవాహనాలే కాదు ఆర్టీసీ బస్సులు కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం..

Also Read :Kejriwals Future Plan: కేజ్రీవాల్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి ? పార్టీ పగ్గాలు ఎవరికి ?

రూ.1.84 కోట్ల జరిమానాల్లో కట్టింది ఎంత?

ట్రాఫిక్ రూల్స్ ఎవరికైనా ఒక్కటే. ప్రభుత్వానికి చెందిన ఆర్టీసీ(TS RTC Buses) బస్సుకైనా, సామాన్య మానవుడి టూ వీలర్‌కైనా రూల్ ఒక్కటే. ఈవిషయంలో రాజీపడకుండా చిత్తశుద్ధితో హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు. వారు చొరవతో పనిచేసి 2022 సంవత్సరం నుంచి 2025 జనవరి 27 వరకు తెలంగాణ ఆర్టీసీ బస్సులకు ఏకంగా 25,609 ఈ–ఛలాన్లు జారీ చేశారు. వాటికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ నుంచి ట్రాఫిక్ విభాగానికి దాదాపు రూ.1.84 కోట్ల జరిమానాలు చెల్లించాలి. అయితే ఇందులో తెలంగాణ ఆర్టీసీ సంస్థ రూ.74.03 లక్షలే ట్రాఫిక్ విభాగానికి చెల్లించింది. యుగాంతర్‌ ఫౌండేషన్‌కు చెందిన యూఆర్టీఐ సంస్థ సమాచార హక్కు చట్టం కింద ట్రాఫిక్‌ పోలీసు విభాగానికి దరఖాస్తు పెట్టి ఈ విలువైన  సమాచారాన్ని సేకరించింది. సమాచార హక్కు చట్టాన్ని వాడుకొని ప్రతీ ఒక్కరు ఇలాంటి కీలకమైన సమాచారాన్ని ప్రభుత్వ విభాగాల  నుంచి రాబట్టవచ్చు.

Also Read :Tsunami : సముద్రంలో భారీ భూకంపం.. సునామీ సైరన్.. 20 దేశాలు అలర్ట్

ప్రధానమైన ఉల్లంఘనలు ఇవీ.. 

ట్రాఫిక్ పోలీసులు ఊరికే ఛలాన్లు జారీ చేయరు. టైం పాస్ కోసం ఫైన్లు వేయరు. ఏదైనా ట్రాఫిక్ రూల్‌ను ఉల్లంఘించిన వాహనాలపై మాత్రం ఫైన్లు విధించారు. హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సులు పలుచోట్ల ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నాయి. దీన్ని చూస్తూ ట్రాఫిక్ పోలీసులు ఊరుకోలేరు కదా. అందుకే ఫైన్లు వేశారు.