Women Harassment: గణేష్ ఉత్సవాల్లో ఆడవారి పట్ల అసభ్య ప్రవర్తన.. 240 మంది అరెస్ట్?

సమాజంలో రాను రాను ఆడవారికి రక్షణ కరువవుతోంది. దేశవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవి చాలావు అన్నట్లు మానసిక వేధింపులు, చంపడం లాంటివి కూడా చేస్తున్నారు

  • Written By:
  • Updated On - September 18, 2022 / 10:23 AM IST

సమాజంలో రాను రాను ఆడవారికి రక్షణ కరువవుతోంది. దేశవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవి చాలావు అన్నట్లు మానసిక వేధింపులు, చంపడం లాంటివి కూడా చేస్తున్నారు. అయితే అలా ఆడవారిని అత్యాచారం చేస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తున్న వారి పట్ల ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోకపోవడంతో ఆ ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారు. ఇంటా బయట ఆడవారికి రక్షణ కరువవుతోంది. మహిళలు ఇల్లు దాటి బయటికి రావాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే దేవాలయాలకు దేవుళ్లకు వెళ్ళినా కూడా మహిళలను విడిచిపెట్టడం లేదు కామాంధులు. తాజాగా అలానే ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశవ్యాప్తంగా తాజాగా వినాయక చవితి ఉత్సవాలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ గణేష్ ఉత్సవాల్లో భాగంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలను అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ వ్యాప్తంగా మహిళలను వేధించిన 240 మంది ఆకతాయిలను అరెస్ట్ చేశారు. గణేష్ మండపాలు, నిమజ్జన స్థలాల వద్ద షీ టీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టి ఆకతాయిల ఆట కట్టించారు. కాగా తాజాగా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. హైదరాబాద్​లో నిమజ్జనం కోసం దాదాపుగా 35 వేల మంది బలగాలతో పోలుసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గణేష్ ల శోభాయాత్ర జరుగుతున్న ప్రదేశాలలో ప్రత్యేకంగా 739 సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది.

హైదరాబాదులోని ట్యాంక్​ బండ్​ అలాగే పరిసర ప్రాంతాలలో పది డ్రోన్​ కెమెరాలతో నిఘా పెట్టారు. డీజీపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ లోని కమాండ్ అండ్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌, బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌ సీపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లోని కంట్రోల్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ నుంచి శోభాయాత్రను పోలీసులు ట్రాక్ చేశారు. ఇక పాతబస్తీ లోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించి భాగ్యనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గణేశ్ ఉత్సవ సమితి తో కలిసి ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు పూర్తి చేశారు. గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 240 మంది ఆకతాయిలను అరెస్టు చేశారు.