Hyderabad Real Estate : హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 22 శాతం మేర పడిపోయాయి. భాగ్యనగరం పరిధిలో గత 3 నెలల్లో కేవలం 16వేల ఇళ్లే సేల్ అయ్యాయి. గత ఏడాది వ్యవధిలో ఇళ్ల విక్రయాలు దాదాపు 5వేల యూనిట్లు తగ్గిపోయాయి. దీంతో సిటీ పరిధిలో కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల లాంఛింగ్‌లు ఆగిపోయాయి. హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్ సంక్షోభం వాస్తవమేనని ‘క్రెడాయ్-సీఆర్‌ఈ మ్యాట్రిక్స్’ నివేదిక తెలిపింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తేనే రియల్ ఎస్టేట్ మార్కెట్ పురోగతి సాధ్యమవుతుందని పేర్కొంది. ఒకప్పుడు నిర్మాణరంగంలో రారాజుగా వెలుగొందిన హైదరాబాద్ నగరం.. ఇప్పుడు కుదేలు అవుతోందని చెప్పింది. హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో మిడ్ ఎండ్ (రూ.45 లక్షలోపు) ఉండే ఇళ్ల కొనుగోళ్లే అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇళ్ల సేల్స్ తగ్గిపోవడంతో హైదరాబాద్‌లోని కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీగానే ఆఫర్లు ఇస్తున్నాయి. ఇంటీరియర్‌లు, మాడ్యులర్ కిచెన్, పార్కింగ్ ఫ్రీ అని చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీలు ఇస్తున్నాయి.
Also Read :VIP Number: వీఐపీ ఫోన్ నంబర్ కావాలా ? ఇదిగో కొత్త సిమ్
2050 హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ లెక్కలివీ..
- హైదరాబాద్ మహా నగరం(Hyderabad Real Estate) విస్తరణ కోసం 2050 మాస్టర్ ప్లాన్ రెడీగా ఉంది.
- దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లు విలువైన ప్రాజెక్టులను నగరం పరిధిలో చేపట్టనుంది.
- ఇందులో భాగంగా హైదరాబాద్- ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన దాదాపు 767 కిలోమీటర్ల రైల్ కారిడార్‌ను నిర్మించనున్నారు.
- హైదరాబాద్- ఇండోర్ ఎక్స్‌ప్రెస్ వే కోసం 713 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నారు.
- భారత్ మాల పరియోజన ఫేజ్1 ప్రాజెక్టు కింద జాతీయ రహదారుల సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టింది.
- ఆరు కొత్త మార్గాల్లో 116 కిలోమీటర్ల పొడవునా మెట్రో రైలును విస్తరించనున్నారు.
- ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వాటర్ సరఫరా పథకం ఫేజ్-2 కింద ప్రతిరోజూ 137 మిలియన్ లీటర్ల నీటిని సప్లై చేయనున్నారు.
- స్టోరేజీ రిజర్వాయర్ 2865 కిలోమీటర్ల మేర పైపు లైను పనులను చేపట్టనున్నారు.మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు పనులు జరగనున్నాయి.
- 30 వేలకుపైగా ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పనులు జరుగుతాయి.