BSP 2023 Manifesto : బీఎస్‌పీ మేనిఫెస్టో విడుదల

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా 10 పథకాలతో కూడిన బీఎస్‌పీ మేనిఫెస్టో ను విడుదల చేసారు

Published By: HashtagU Telugu Desk
Bsp Manifesto Release

Bsp Manifesto Release

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ( Telangana Assembly Elections ) సమీపిస్తుండడం తో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టో (Menifesto ) లతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఇప్పటీకే అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీలు తమ మేనిఫెస్టో లను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టగా..నేడు మంగళవారం బీఎస్‌పీ మేనిఫెస్టో (BSP Manifesto)ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) విడుదల చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా 10 పథకాలతో కూడిన బీఎస్‌పీ మేనిఫెస్టో ను విడుదల చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఎస్‌పీ మేనిఫెస్టో (BSP Manifesto) హైలైట్స్ :

1. కాన్షీ యువ సర్కార్: యువతకు ఐదేళ్లల్లో 10 లక్షల ఉద్యోగాలు (అందులో మహిళలకు 5 లక్షల కొలువులు)

2. పూలే విద్యా దీవెన: మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్. ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య. Data, AI, మరియు కోడింగ్‌లో శిక్షణ

3. బహుజన రైతు ధీమా: ప్రతి పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీ. ధరణి పోర్టల్ రద్దు

4. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి: మహిళా కార్మికులు మరియు రైతులకు ఉచిత వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్, మరియు డ్రైవింగ్ శిక్షణ. అంగన్‌వాడీ, ఆశావర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ. మహిళా సంఘాలకు ఏటా రూ. లక్ష

5. భీం రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం మరియు ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు మరియు ఒంటరి మహిళలకు తోడ్పాటు.

6. బ్లూ జాబ్ కార్డ్‌: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ. రోజూ కూలీ రూ. 350కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య మరియు జీవిత బీమా

7. నూరేళ్ల ఆరోగ్య ధీమా: ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ. ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జెట్‌ కేటాయింపు

8. వలస కార్మికుల సంక్షేమ నిధి: 5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు వలస కార్మికులకు వసతి గిగ్ కార్మికులు, లారీ మరియు టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు.

9. షేక్ బందగీ గృహ భరోసా: ఇల్లు లేని వారికి 550 చ.గ. ఇంటి స్థలం ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షల సహాయం ఇంటి పునర్నిర్మాణానికి రూ. లక్ష సహాయం

10. దొడ్డి కొమురయ్య భూమి హక్కు : భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా.

Read Also : Telangana TDP: పవన్ ప్రచారం చేయండి ప్లీజ్.. జనసేనానికి టీటీడీపీ నేతల రిక్వెస్ట్

  Last Updated: 17 Oct 2023, 04:31 PM IST