Site icon HashtagU Telugu

2008 DSC Candidates : ప్రజా భవన్ వద్ద డీఎస్సీ 2008 బాధితుల ఆవేదన..

2008 Dsc Cand

2008 Dsc Cand

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ (Praja Bhavan) వద్ద డీఎస్సీ 2008 బాధితులు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని వారంతా కోరుతూ ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజా భవన్ లో ప్రజావాణి పేరుతో ప్రతి మంగళవారం ప్రజల నుండి పిర్యాదులు తీసుకునే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కార్యక్రమం చేపట్టిన దగ్గరి నుండి ప్రతి మంగళవారం రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు తమ బాధలు చెప్పుకునేందుకు వస్తున్నారు. తమ సమస్యలను తెలుపుతూ లేఖలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 300 మందికిపై 2008 DSC అభ్యర్థులు ప్రజాభవన్‌కు వచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, గతంలో రేవంత్‌ రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. డీఎస్సీ 2008కి చెందిన వెయ్యి మంది బాధితుల 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలని వారంతా కోరారు. తమ విషయమై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. మరి దీనిపై సీఎం ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.

Read Also : Modi : దక్షిణ భారత్ కు గేట్ వేలా తెలంగాణ – మోడీ