Site icon HashtagU Telugu

200 Units – Free Electricity : ప్రతినెలా 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్.. ఎప్పటి నుంచి ?

200 Units Free Electricity

200 Units Free Electricity

200 Units – Free Electricity : ఇప్పుడు యావత్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అమల్లోకి తేబోతున్న ఆరు గ్యారంటీలపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే సోనియా గాంధీ బర్త్ డే కానుకగా మహాలక్ష్మీ (బస్సుల్లో ఫ్రీ జర్నీ),  రూ.10 లక్షల వైద్య పరిమితితో రాజీవ్ ఆరోగ్యశ్రీ (Rajiv ArogyaSri) పథకాలకు శ్రీకారం చుట్టారు. అయితే మిగిలిన నాలుగు గ్యారంటీల అమలు కోసం ప్రజలు ఆశగా, ఆతురతగా ఎదురు చూస్తున్నారు. మిగిలిన హామీల్లో ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని కనెక్ట్ చేసే స్కీమ్..గృహజ్యోతి. ఈ సంక్షేమ పథకం ద్వారా రాష్ట్రంలోని ఇళ్లకు ప్రతినెలా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్‌‌ను సప్లై చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.  చాలావరకు మధ్యతరగతి కుటుంబాలు ప్రతినెలా 200 యూనిట్లలోపే కరెంట్ వాడుతాయి. వారి పాలిట ఈ స్కీమ్ వరం లాంటిది.

We’re now on WhatsApp. Click to Join.

గృహజ్యోతి అమల్లోకి వచ్చాక.. అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం ఉండదు.  అయితే ఈ స్కీమ్ అమల్లోకి వచ్చేందుకు ఇంకొంత టైం పట్టేలా ఉంది. ఎందుకంటే ఏ స్కీమ్‌ను అమల్లోకి తేవాలన్నా.. దానిపై అంచనాలను ముందస్తుగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. లాభ, నష్టాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం విద్యుత్ పంపిణీ, ఉత్పత్తి వ్యవస్థలపై సమీక్ష నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాతే గృహజ్యోతి స్కీమ్ అమలు దిశగా అడుగులు పడుతాయి.  అప్పటిదాకా మునుపటిలాగే రాష్ట్ర ప్రజలంతా కరెంటు బిల్లులు కట్టాలి.

Also Read: Old Phone – Selling Tips : పాత ఫోన్ అమ్మేస్తున్నారా ? ఈ జాగ్రత్తలు మస్ట్

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నెలనెలా 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా(200 Units – Free Electricity) ఇస్తే ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.4,008 కోట్ల భారం పడుతుంది. గత శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి  విద్యుత్‌ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈవిషయాన్ని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా స్థితిగతులు, విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితి, ఆదాయ, వ్యయాలు, అప్పులు, నష్టాల వివరాలను విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించాయి. విద్యుత్‌ సంస్థల ఆర్థిక స్థితిపై సమగ్ర నివేదికను ఆయనకు సమర్పించాయి.