అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) నేపథ్యంలో కేంద్ర హోం శాఖ (Central Home Department) భారీ ఎత్తున కేంద్ర బలగాలను (Central Forces) రాష్ట్రంలోకి దింపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు గట్టిగా ఉండబోతున్నాయి. రెండుసార్లు అధికారం చెప్పిన బిఆర్ఎస్ ను గద్దె దించి తాము విజయం సాధించాలని కాంగ్రెస్ , బిజెపి పార్టీలు చూస్తున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రూ.243 కోట్లకు పైగా విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎన్నికల సమయానికి నగదు పెద్ద సంఖ్యలో చేతులు మారతాయని భావించిన హోం శాఖ రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపించాలని నిర్ణయించింది. దీంతో 20 వేల బలగాలు మరో 2 రోజుల్లో తెలంగాణకు రానున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘ సూచనల మేరకు, కేంద్ర హోం శాఖ 100 కంపెనీల నుంచి 20 వేల కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపించనుంది. మరో 2 రోజుల్లో ఈ బలగాలు రంగంలోకి దిగనున్నాయి. ఒక్కో కంపెనీలో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎప్, సీఆర్పీఎఫ్, ఇండో టిబిటెన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సశస్త్ర సీమాబల్ వంటి బలగాలకు చెందిన 60 నుంచి 80 మంది సిబ్బంది వరకూ ఉండనున్నారు. కేంద్ర బలగాలు రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పోలీసులను సమన్వయం చేసుకుని బందోబస్తు నిర్వహించనున్నారు.
పోలింగ్ ముందు రోజే సమస్యాత్మక కేంద్రాలను తమ ఆధీనంలోకి ఈ బలగాలు తీసుకుంటాయి. అలాగే, ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాలు సైతం వీరి ఆధీనంలోనే ఉండనున్నాయి. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించడం, పోలింగ్ అనంతరం తిరిగి వాటిని స్ట్రాంగ్ రూంలకు తరలించే ప్రక్రియ అంతా వీరి ఆధ్వర్యంలోనే జరగనుంది. బందోబస్తు విధులతో సహా డబ్బు, మద్యం వంటి అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీల్లోనూ ఈ బలగాలు నిమగ్నం కానున్నాయి.
Read Also : BRS Party: బీఆర్ఎస్ ఆకర్ష్, గులాబీ గూటికి అంబర్ పేట శంకర్