New Ration Cards : కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణలో దాదాపు 20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటన్నింటిపై ఎంక్వైరీ పూర్తి చేసి.. రేషన్ కార్డుల అర్హుల జాబితాను ఈ నెలాఖరుకల్లా విడుదల చేసే ఛాన్స్ ఉంది. శివరాత్రి (మార్చి 8) నాటికి కొత్త రేషన్ కార్డుదారులకు రేషన్‌ను పంపిణీ చేసే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దరఖాస్తులు సమర్పించలేని వాళ్లు.. గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయంలో అప్లికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు అంటూ ఏదీ లేదని.. ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన వెల్లడించడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించింది. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలకు దరఖాస్తులను తీసుకున్నారు. దీనిలో యువ వికాసం గ్యారంటీకి మాత్రం అప్లికేషన్లను తీసుకోలేదు. మొత్తం 5 గ్యారంటీలకు దాదాపు 1.25 కోట్ల మంది అప్లై చేశారు. వీటితో పాటు చాలామంది రేషన్ కార్డులు లేని వాళ్లు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లను సమర్పించారు. మొత్తం 1.25 కోట్ల ప్రజాపాలన అప్లికేషన్లలో ‘అభయహస్తం’ ఐదు గ్యారంటీల అప్లికేషన్లు 1.05 కోట్లు ఉన్నాయి. రేషను కార్డు, ధరణి తదితరాల కోసం మరో 19.92 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ప్రజాపాలన దరఖాస్తుల లాస్ట్ డేట్ అయిన జనవరి 6న మొత్తం 16.90 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో ఐదు గ్యారంటీల అప్లికేషన్లు 12.53 లక్షలు(New Ration Cards) ఉన్నాయి
Also Read: Bangladesh Elections : బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పార్టీ బంపర్ విక్టరీ.. 200 సీట్లు కైవసం
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. తెలంగాణలో రేషన్ కార్డులు మంజూరు చేసి చాలా ఏళ్లు కావస్తుండటంతో పెళ్లిళ్లు చేసుకొని కుటుంబాలుగా ఏర్పడిన వారు రేషన్ కార్డుల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రేషన్ కార్డ్ ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే కచ్చితంగా రేషన్ కార్డ్ ఉండాల్సిందే. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డ్ ఉన్న వారికే సంక్షేమ పథకాలు అందుతాయంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందుకే పేద ప్రజలు ప్రతీ ఒక్కరూ కచ్చితంగా రేషన్ కార్డ్ ఉండాలని కోరుకుంటారు. అందుకోసం అందరూ దరఖాస్తు చేసుకుంటారు. ఆరోగ్య శ్రీ వంటి పథకాలకు కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.