Telangana : రోజుకు 20 లక్షల బీర్లు..అయినా సరిపోవడం లేదని గగ్గోలు..

ఎన్నికల నియమావళి అడ్డురావడంతో ఇసారి ఇలాంటివి ఏవీ కూడా చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి

  • Written By:
  • Publish Date - May 5, 2024 / 04:36 PM IST

తెలంగాణ (Telangana ) లో ఎండలు (Summer ) ఏ రేంజ్ లో దంచి కొడుతున్నాయో తెలియంది కాదు..ఉదయం 9 దాటితే నిప్పుల కొలిమిలా మారుతుంది. ఇంట్లో నుండి అడుగు భయటపెట్టాలనే ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 07 వరకు కూడా వేడి ఏమాత్రం తగ్గకపోయేసరికి ప్రజలంతా కూలర్లు , ఫ్యాన్లు , ఏసీలకు అత్తుకుపోతున్నారు. ఇక ఈ వేడి తాపాన్ని తట్టుకోలేక మందుబాబులు బీర్లను తెగతాగేస్తూ ఉండడం తో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత ఏర్పడుతుంది. సరఫరా కు మించి బీర్ల అమ్మకాలు జరుగుతుండడం తో లిక్కర్ సంస్థలు డిమాండ్ కు తగ్గట్లు ఇవ్వలేకపోతుంది. దీంతో గత పది రోజులుగా రాష్ట్రంలోని అన్ని వైన్స్ లలో బీర్ల కొరత ఏర్పడింది. దీంతో మాకు బీర్లు అందజెయ్యండి మహాప్రభో అంటూ ఏకంగా తెలంగాణ సర్కార్ కు లేఖలు రాస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 20 లక్షల బీర్లు తాగేస్తున్నారట..అయినాగానీ అవి ఏమాత్రం సరిపోవడం లేదని వైన్ షాప్స్ పేర్కొంటున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ మామూలుగానే లిక్కర్‌ అమ్మకాల కంటే బీర్లు విక్రయాలు అధికం. ఇక్కడ ఐటీ, ఫార్మా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉండడం, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేకాకుండా హైదరాబాద్‌ అంతర్జాతీయ డెస్టినేషన్‌ కావడంతో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగ, వ్యాపార, వృత్తి తదితర అవసరాలకు రాకపోకలు సాగించే వారి సంఖ్య కూడా భారీ ఎత్తున ఉంటుంది. దీంతో ఇక్కడ మద్యం విక్రయాలు భారీ మొత్తంలో ఉంటాయి. వేసవి వచ్చిందంటే లిక్కర్‌ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం, బీర్లు విక్రయాలు పెరగడం కామన్. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్‌ అధికారులు కూడా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.

బ్రీవరీలకు మూడో షిఫ్ట్​కు అనుమతి ఇచ్చి ఉత్పత్తిని పెంచడం, డిమాండ్‌ అధికంగా ఉండే బ్రాండ్లు కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ ఎన్నికల నియమావళి అడ్డురావడంతో ఇసారి ఇలాంటివి ఏవీ కూడా చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు తోడు బీర్లు సరఫరా చేసే బ్రీవరీలకు ప్రతి 45 రోజులకు బిల్లులు చెల్లించే విధానం తెలంగాణాలో కొనసాగుతోంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి బ్రీవరీలకు చెల్లింపులు సక్రమంగా లేకపోవడంతో దాదాపు రెండువేల కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చెల్లింపులు చేయాలని కొత్త ప్రభుత్వాన్ని బ్రీవరీల యాజమానులు కోరుతున్నారు. ఇప్పటికే మూడో షిప్ట్‌ బీరు తయారీకి చెందిన, బిల్లులు పెండింగ్‌ రెండు ఫైళ్లు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. మూడో షిప్ట్‌ బీరు ఉత్పత్తికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో బీర్ల కొరత ఏర్పడింది. లేకపోతే అన్ని చోట్ల బీర్లు అనేవి దొరుకుతూ ఉండేవి.

 

Read Also : Rahul Gandhi : దేశంలో ఉన్న ధనికుల కోసం బిజెపి పనిచేస్తుంది – రాహుల్ గాంధీ