Site icon HashtagU Telugu

Big Shock To BRS: బీఆర్ఎస్కు 20 మంది కౌన్సిలర్లు రాజీనామా

Big Shock To BRS

Big Shock To BRS

Big Shock To BRS: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో క్యాంపు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేశారు. 19 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి రాజీనామా లేఖను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి పంపారు. అయితే సంతకం చేయనప్పటికీ వైస్ చైర్మన్ సుదర్శన్, 14వ వార్డు కౌన్సిలర్ బొడ్డు నారాయణ కూడా రాజీనామాకు అంగీకరించినట్లు సమాచారం.

వారం రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌కు చెందిన 18 మంది కౌన్సిలర్లు బస్సులో శిబిరానికి వెళ్లారు . శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగనుంది. బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. వీరిలో ఒక వార్డు కౌన్సిలర్ గతంలో మరణించారు. ప్రస్తుతం 11 మంది కాంగ్రెస్‌కు, ఒకరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి 21 మంది రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. పలు స్థానాల్లో బీఎస్పీ, జనసేన, సీపీఎం, ఎంఐఎం, ప్రజాశాంతి పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిఆర్ఎస్ 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక బీజేపీ 8, ఎంఐఎం 7 ఎమ్మెల్యేలతో సరిపెట్టుకుంది.

Also Read: Telangana: తెలంగాణలో 31 కొత్త కరోనా కేసులు నమోదు!

Exit mobile version