KCR : కాంగ్రెస్ లో అలజడి సృష్టించిన కేసీఆర్.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో..

తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని..వారిని ఇప్పుడంటే ఇప్పుడు బిఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ఓ కీలక నేత రెడీ గా ఉన్నారని

  • Written By:
  • Publish Date - April 18, 2024 / 08:33 PM IST

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) ..తాజాగా కాంగ్రెస్ పార్టీ (Congress ) లో అలజడి సృష్టించారు. అసెంబ్లీ ఎన్నికల దగ్గరి నుండి కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే. వరుస పెట్టి బిఆర్ఎస్ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ వెళ్తుంది. మాజీ మంత్రులు , కేసీఆర్ తో నడిచిన కీలక నేతలే కాకుండా తాజాగా బిఆర్ఎస్ నుండి గెలిచినా ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్ కు షాక్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరారు. ఈ బలంతో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తిరుగులేదని వారంతా ధీమాగా ఉన్నారు. ఈ తరుణంలో కేసీఆర్ ఓ బాంబ్ పేల్చారు. తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని..వారిని ఇప్పుడంటే ఇప్పుడు బిఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ఓ కీలక నేత రెడీ గా ఉన్నారని..కాకపోతే నేనే వద్దు అంటుంటే వారు ఆగుతున్నారని..లేకపోతే ఇప్పటికే వారు తనవద్దకు వచ్చేవారని తెలిపి షాక్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ విస్తృత సమావేశం ఏర్పాటు చేసారు కేసీఆర్. ఈ సమావేశానికి బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులతో పాటు పార్టీ నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్‌దే.. రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపు కూడా మ‌న‌దే అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. నాల్గు నెలల్లోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని.. ఇప్పుడు జరగబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బిఆర్ఎస్ కు మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలంతా ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు. అధికారం ఉంద‌ని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇక్క‌డంతా బీజేపీ క‌థ న‌డుస్తోంద‌ని ఓ నేత త‌న‌తో చెప్పుకొచ్చారు. 20 మంది ఎమ్మెల్యేల‌ను తీసుకొని రావాలా సార్ అని ఓ కీల‌క నేత‌ త‌న‌ను సంప్ర‌దించాడు. ఇప్పుడే వ‌ద్ద‌ని వారించాన‌ని కేసీఆర్ తెలిపి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో అలజడి సృష్టిస్తున్నాయి. ఎవరా ఆ 20 మంది అని అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ నుండి వచ్చిన నేతలే కాంగ్రెస్ లో ఎక్కువగా ఉన్నారు..వారేమైనా కేసీఆర్ తో టచ్ లో ఉన్నారా..? లేక మరెవరైనా బిఆర్ఎస్ తో టచ్ లో ఉంటూ వస్తూ..ఇక్కడ జరిగే విషయాలు చేరవేస్తున్నారా..? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read Also : KCR Reacts On Kavitha Arrest : కవిత అరెస్ట్ ఫై ఫస్ట్ టైం స్పందించిన కేసీఆర్