తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు (Telangana RTC passengers) గుడ్ న్యూస్ తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar). కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం అందజేసి నమ్మకం నిలబెట్టుకున్న సర్కార్..ఆ తర్వాత కూడా ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలో మరో రెండు కొత్త బస్సు డిపో లకు (New Bus Depots) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త బస్ డిపోలు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కొత్త బస్ డిపోల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఆర్డర్లు జారీ అయ్యాయి. ములుగు, పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లోని ఏటూరు నాగారం, పెద్దపల్లి పారిశ్రామిక కేంద్రం ప్రాంతాల్లో రెండు కొత్త డిపోలు ఏర్పాటు చేయనున్నారు. ఈ డిపోలు ప్రజలకు మరింత సౌకర్యం అందించడంతో పాటు, ఆర్టీసీకి కూడా లాభాలు తీసుకురావడం లో తోడ్పడనున్నాయి.
ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సర్కారు నిర్ణయంతో దాదాపు 10-15 సంవత్సరాల తరువాత కొత్త డిపోల ఏర్పాటు అవుతుందని తెలిపారు. కొత్త బస్సులు కొనుగోలు, నూతన ఉద్యోగ నియామకాలు మరియు కార్మిక సంక్షేమం కోసం చేపట్టిన చర్యలు ఆర్టీసీకి లాభాలు తీస్తున్నాయని తెలిపారు. ములుగు జిల్లా మూడు, నాలుగు జిల్లాలకు సరిహద్దు. సమ్మక్క సారలమ్మ కొలువైన ప్రాంతం. తొందరలోనే అక్కడ బస్సు డిపో నిర్మాణం చేపట్టి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. పెద్దపల్లి పారిశ్రామిక కేంద్రం. జిల్లా కేంద్రం చేసినప్పటికీ బస్సు డిపో లేదు. అక్కడి శాసనసభ్యుడు, మంత్రి శ్రీధర్ బాబు సూచన మేరకు ఈ బస్సును మంజూరు చేస్తున్నాం. ములుగు, పెద్దపల్లి జిల్లా ప్రజలకు రవాణాశాఖ మంత్రిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ కొత్త బస్సు డిపోలు మంజూరు
నూతన ఉద్యోగ నియామకాలు, నూతల బస్సుల కొనుగోలు, ఆర్టీసీ సంస్కరణలు ,కార్మికుల సంక్షేమం ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రాలుగా ఉన్న పెద్దపల్లి ములుగు జిల్లా లోని ఏటూరు నాగారంలో రెండు నూతన ఆర్టీసీ బస్సు డిపోలు ఏర్పాటు చేస్తున్నాం! pic.twitter.com/3OZLzOzvAd
— Ponnam Prabhakar (@Ponnam_INC) December 4, 2024
Read Also : MLC Kavitha: మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 2500 ఇవ్వాల్సిందే.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్