Site icon HashtagU Telugu

BRS – BSP : బీఎస్పీకి ఆ 2 లోక్‌సభ సీట్లు.. బీఆర్ఎస్​ కీలక నిర్ణయం

Brs Bsp

Brs Bsp

BRS – BSP : ఈసారి లోక్​సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న  బీఆర్ఎస్, బీఎస్పీలు సీట్ల పంపకాలపై స్పష్టతకు వచ్చాయి. పొత్తులో భాగంగా బీఎస్పీకి హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానాలను కేసీఆర్ కేటాయించారు. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని తెలుస్తోంది. హైదరాబాద్​ స్థానం నుంచి పోటీ చేయనున్న బీఎస్పీ నేత ఎవరు అనేది తెలియాల్సి ఉంది. దీనిపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందుకు ప్రతిగా రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఎస్పీ మద్దతు ప్రకటించనుంది. ఇరు పార్టీల పొత్తుపై  ట్విట్టర్ (ఎక్స్‌) వేదికగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. పొత్తు నిర్ణయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి, దేశంలోని బహుజనుల రక్షణ కోసం ఈ పొత్తు ఒక చారిత్రాత్మక అవసరమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS – BSP) వెల్లడించారు. రాష్ట్రంలో తమ లౌకిక కూటమి విజయ దుందుభి మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి అనుమతించిన బీఎస్‌స్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం మాయావతి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భారత రాష్ట్ర సమితి​- బీఎస్పీ పొత్తుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి స్పందించారు. నాగర్​కర్నూల్ బీఆర్​ఎస్​, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగనున్నారని వెల్లడించారు. ఆర్ఎస్​పీ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. 100 రోజుల కాంగ్రెస్ అసమర్థ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. బీఆర్​ఎస్​తోనే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోగలమని, నాగర్​కర్నూల్ ఎంపీ స్థానాన్ని గెలిపించి కేసీఆర్​కు బహుమతిగా ఇస్తామని స్పష్టం చేశారు.

Also Read : Election Duty : వాలంటీర్లకు నో ఎలక్షన్ డ్యూటీ.. జగన్ సర్కారు ఆదేశాలు