TS : రైతు బంధు స్కీమ్‌లో 2 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన పోలీసులు

ముఖ్యంగా రైతుబంధు (Rythu Bandhu) , రైతు భీమా స్కిం (Rythu Bheema) లలో పెద్ద ఎత్తున దోపిడీ , అవినీతి జరుగుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది

  • Written By:
  • Updated On - February 26, 2024 / 05:09 PM IST

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం హయాంలో.. పథకాలు, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటినుండి ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి మొత్తం బయటపెడతామని హెచ్చరిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు అధికారంలోకి రావడమే ఆలస్యం..గత ప్రభుత్వంలో జరిగిన బాగోతాలన్నీ బయటపెట్టి పనిలో పడ్డారు సీఎం రేవంత్. ఇప్పటీకే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబదించిన అవకతవకలు , జరిగిన అవినీతి తదితర వాటిని బయటపెట్టగా.. మిగతా స్కిం లలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని, వాటిని బయట పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. దీంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా రైతుబంధు (Rythu Bandhu) , రైతు భీమా స్కిం (Rythu Bheema) లలో పెద్ద ఎత్తున దోపిడీ , అవినీతి జరుగుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది.

తాజాగా రైతు బంధు, రైతు బీమా డబ్బులు కొట్టిసిన ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. కొన్నేళ్లుగా నకిలీ వ్యక్తులు పేరుతో డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. భూములు లేక్కున్నా ఉన్నట్లు చూపించి రైతు బంధు, రైతు బీమా సొమ్ము స్వాహా చేస్తున్నారని పేర్కొన్నారు. మొత్తం రూ.2 కోట్లు కొట్టేసిన వ్యవహారంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తేలడంతో అతణ్ని సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.గత సర్కార్ మరణించిన రైతులకు బీమా కింద రూ.5 లక్షలు, రైతుబంధు కింద పెట్టుబడి కోసం ఎకరాకు ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

దీన్ని రంగారెడ్డి జిల్లా కొందర్గు మండల వ్యవసాయ శాఖలోని కొందరు అవకాశంగా మార్చుకుని తమ పరిధిలోని రైతుల వివరాలు సేకరించి.. 20 మంది మరణించినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. వాటి ఆధారంగా బీమాకు దరఖాస్తు చేసి, సుమారు రూ.కోటి స్వాహా చేశారు. ముంబయిలోని ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో అధికారులు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అవినీతి వెలుగులోకి వచ్చింది. ఇదే కాదు గొర్రెల పంపిణీ పథకంలోనూ.. అక్రమాలు జరిగినట్టుగా కాగ్ నివేదిక కీలక విషయాలు బయటపెట్టింది. ఉన్నతాధికారుల కళ్లు గప్పి ఆ నిధులు స్వాహా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

Read Also : Adani EV : ఉబెర్‌ – అదానీ గ్రూప్ ఈవీ వ్యాపారం.. ఏం చేస్తారంటే ?