హైదరాబాద్- విజయవాడ హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో నేషనల్ హైవేపై రెండు ఆర్టీసీ బస్సుల్లో (2 Buses) ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Army Jawan Dead: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల భీభత్సం.. ఆర్మీ జవాన్‌ను కాల్చి చంపిన మావోలు
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లాలోని దురాజ్ పల్లి వద్ద ఆదివారం ఉదయం రెండు ప్రైవేట్ బస్సులు దగ్దమయ్యాయి. ఓ ప్రైవేట్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ బస్సు పక్కనే మరో బస్సు ఉంది. దీంతో మొదటి బస్సు నుండి రెండో బస్సుకు మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో రెండు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ బస్సుల్లో ప్రయాణీకులు ఎవరూ లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సుల్లో మంటలు వ్యాపించిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది బస్సులో మంటలను ఆర్పివేశాయి. ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సు ఢీకొనడంతోనే మంటలు వ్యాపించినట్లు మరికొందరు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.