Site icon HashtagU Telugu

Indo Pak War : ఇండో పాక్ యుద్ధం జరిగి 50 ఏండ్లు పూర్తి

1971 Indo Pak War

1971 Indo Pak War

1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధం జరిగి నేటికి అర్ధ శతాబ్దం పూర్తయ్యింది. డిసెంబరు 3, 1971 సాయంత్రం మొదలయిన యుద్ధం డిసెంబరు 16, 1971 తేదీన పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో భారత సైన్యం, బంగ్లాదేశ్ సైన్యం కలసి కట్టుగా పాకిస్తాన్ సైన్యంతో పొరాడింది. కేవలం 13 రోజుల్లోనే యుద్ధం ముగిసింది. అతి తక్కువ రోజుల్లో ముగిసిన యుద్ధంగా ఇది రికార్డులకెక్కింది.భారత్ లోని 11 వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు ప్రారంభించడంతో ఈ యుద్ధం మొదలైంది. భారతదేశ త్రివిధ దళాలు తొలిసారి ఐక్యంగా ఒక దేశంపై పోరాడడం ఇదే మొదటిసారి. ఈ యుద్ధంలో ఇండియా దాదాపు 15,010 కిలోమీటర్ల పాకిస్తాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది.


యుద్ధం జరుగుతోన్న సమయంలో ఇండియా పాక్ బలగాలు తూర్పు, పడమటి దిశలలో ఘర్షణ పడ్డారు. తూర్పు కమాండ్‌కు చెందిన పాకిస్తానీ సైనిక బలగాలు లొంగుబాటు పత్రం పై సంతకాలు చేసాక, యుద్ధం ముగిసింది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఇంతపెద్ద మొత్తంలో ఒక దేశ సైన్యం మరోదేశ సైన్యానికి బయపడి లొంగిపోవడం ఇదే తొలిసారి.1971 డిసెంబరు 16నాటి లొంగుబాటు తరువాత తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో తూర్పు పాకిస్తాన్‌లో ఉన్న సుమారు 97,368 పశ్చిమ పాకిస్తానీలను ఇండియా తమ యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకుంది.

అందులో 79,700 మంది పాక్ సైన్యానికి చెందిన సైనికులు, పారామిలిటరి సిబ్బంది, మరో 12,500 మంది సాధారణ ప్రజలు ఉన్నారు.యుద్ధంవల్ల ఇరుదేశాలకు ప్రాణనష్టం తప్పలేదు. ఆ యుద్ధం రెండు దేశాల ప్రజల మధ్యన పెంచిన దూరం ఇప్పటికీ తగ్గడం లేదు.

Exit mobile version