Gokul Chat Blasts : హైదరాబాద్ నగరంలోని లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ వద్ద బాంబు పేలుళ్లు జరిగి నేటికి సరిగ్గా 17 ఏళ్లు. 2007 ఆగస్టు 25న సాయంత్రం వేళ బాంబు పేలుళ్లతో ఆ రెండు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఈ రెండు ప్రాంతాల్లో కొన్ని నిమిషాల వ్యవధిలో జరిగిన వేర్వేరు టైం బాంబు పేలుళ్లలో(Gokul Chat Blasts) మొత్తం 42 మంది చనిపోయారు. ఎంతో మంది తమ అవయవాలు కోల్పోయారు.
We’re now on WhatsApp. Click to Join
గోకుల్ ఛాట్‌లో ఏమైందంటే..
2007 ఆగస్టు 25న సాయంత్రం 7.30 గంటల టైంలో లుంబినీ పార్కులో లేజర్ షోలో భాగంగా దాదాపు 500 మంది సందర్శకులు వందేమాతర గీతం వింటుండగా సీట్ల మధ్యలో ఉన్న బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా, మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు. మరో 40 మంది గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో మహారాష్ట్ర నుంచి స్టడీ టూర్ కోసం వచ్చిన స్టూడెంట్స్ ఏడుగురు ఉండడం అందరినీ కలచి వేసింది. ఇది జరిగిన 10 నిమిషాల తర్వాత కోఠి ప్రాంతంలోని ప్రఖ్యాత గోకుల్ ఛాట్ వద్ద మరో బాంబు పేలింది. గోకుల్ ఛాట్‌లో నార్త్ ఇండియన్ స్నాక్స్ దొరుకుతాయి. అందుకే ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అక్కడికి వచ్చి స్నాక్స్ తింటుంటారు. ఈ బాంబు పేలుడులో 10 మంది అక్కడికక్కడే చనిపోగా, మరో 23 మంది హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు. 50 మందికిపైగా గాయపడ్డారు.
Also Read :Hezbollah Vs Lebanon : ఇజ్రాయెల్‌పైకి 320 రష్యా రాకెట్లు.. విరుచుకుపడిన హిజ్బుల్లా
ఈ బాంబు పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులే అని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. టైమర్‌ను ఉపయోగించి ఈ పేలుళ్లు జరిపారని విచారణలో తేలింది. బాంబుల్లో జిలెటిన్, అమ్మోనియం నైట్రేట్లను వాడారని వెల్లడైంది. పోలీసులు ఈ కేసులో మొత్తం 8 మందిపై కేసులు పెట్టారు. అయితేే వీరిలో మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, షఫీక్ సయ్యద్‌లకు కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే సరైన సాక్ష్యాలు లేకపోవడంతో మరో ఇద్దరిని విడుదల చేసింది. ఒబేదుర్ రెహ్మాన్, ధనీష్ అన్సారీ, ఇమ్రాన్ ఖాన్, ఆఫ్తాబ్ ఆలం అనే మరో నలుగురికి సుదీర్ఘ విచారణ అనంతరం 2023 సంవత్సరంలో ఒక్కొక్కరికి పదేళ్ళ కఠిన కారాగార శిక్షను విధించింది.