Doctor MLAs : రాజకీయాల్లోకి ఉన్నత విద్యావంతుల ఎంట్రీ పెరుగుతోంది. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మంది విద్యాధికులే. ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వివిధ పార్టీల తరఫున పోటీ చేశారు. చాలాచోట్ల గెలిచారు కూడా. ఇలా గెలిచిన వారిలో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 16 మంది డాక్టర్లు విజయం సాధించారు. ఈసారి తెలంగాణ ఎమ్మెల్యేల్లో డాక్టర్లే 10శాతానికిపైగా ఉండటం విశేషం.
We’re now on WhatsApp. Click to Join.
- కాంగ్రెస్‌లో డోర్నకల్ నుంచి రాంచందర్ నాయక్, మహబూబాబాద్ నుంచి మురళీ కృష్ణ, మానకొండూరు నుంచి సత్యనారాయణ, అచ్చంపేట నుంచి వంశీకృష్ణ గెలిచారు. వీరంతా ఎంఎస్ జనరల్ సర్జన్ చేశారు.
- కాంగ్రెస్ నుంచే సత్తుపల్లిలో రాగమయి (ఎండీ పల్మనాలజిస్టు), నాగర్‌కర్నూల్‌లో కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, నిజామాబాద్ రూరల్‌లో భూపతిరెడ్డి (ఎంఎస్ ఆర్థో), నారాయణఖేడ్‌లో సంజీవ్‌రెడ్డి (పిడియాట్రీషియన్), నారాయణపేట్‌లో పర్ణికారెడ్డి (రేడియాలజీ), మెదక్‌లో మైనంపల్లి రోహిత్, చెన్నూరులో గడ్డం వివేక్ గెలిచారు.
- ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచే 12 మంది డాక్టర్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు.
- బీఆర్‌ఎస్‌లో భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు (ఎంఎస్ ఆర్థో), కోరుట్ల నుంచి కల్వకుంట్ల సంజయ్ (ఎంఎస్ న్యూరో), జగిత్యాల నుంచి సంజయ్ గెలిచారు.
- బీజేపీలో సిర్పూర్ నుంచి డాక్టర్ పాల్వాయి హరీశ్(Doctor MLAs) గెలిచారు.
Also Read: Grey Hair: నెయ్యిలో వీటిని కలిపి రాస్తే చాలు తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే?