Site icon HashtagU Telugu

CM Revanth Reddy: త్వరలో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: పోలీస్ అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈరోజు 9,656 మంది స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రాలు అందజేస్తున్న సందర్భంగా ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు . ఆ తర్వాత అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది నిరుద్యోగుల పాత్ర ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల త్యాగాల పునాదిపై ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు అని అన్నారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు . కవిత ఎంపీగా ఓడిపోతే కేసీఆర్ ఎమ్మెల్సీ ఇస్తారు కానీ నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఆలోచించడం లేదన్నారు.

గత ప్రభుత్వం తమ కుటుంబ ఉద్యోగాల గురించి ఆలోచించినా నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు. ఉపాధి కల్పిస్తే బీఆర్‌ఎస్‌ నేతల కడుపు మండుతున్నదని, స్టాఫ్‌ నర్సులకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ , హరీశ్‌రావు వీడియో చూడాలని కోరారు. కారుకు తిట్లు తప్పవు అంటూ హరీష్ పై రేవంత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read: Ayodhya: మొట్టమొదటిసారి అయోధ్య రామ మందిరానికి అలాంటి కనుక ఇచ్చిన భక్త బృందం.. అదేంటో తెలుసా?

Exit mobile version