Site icon HashtagU Telugu

MLC Elections : కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ కోసం..15 మంది పోటీ..?

Congress Rajya Sabha Candidates

Congress Emls

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ (MLA Quota MLC By-Election Schedule) విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి (Kadiyam Srihari), కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఈ ఎమ్మెల్సీ టికెట్ కోసం కాంగ్రెస్ లో దాదాపు 15 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ 15 మందిలో ఎవరికీ టికెట్ ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్‌ను త్యాగం చేసినోళ్లకు అవకాశం ఇవ్వాలా? పోటీ చేసి ఓడిన నేతలకు ఇవ్వాలా..? అనేది త్వరలోనే డిసైడ్ చేయనుందట. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అవగా, ఇప్పుడు ఆ రెండింటికీ ఆశావహులు పోటీపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఇద్దరి అభ్యర్ధులను నిలబెడుతుందా? ఒక్కరినే పోటీ లో ఉంచుతుందా? అని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీని సులువుగా గెలుస్తుంది. మరోపక్క బిఆర్ఎస్ కూడా ఒకటి మీము గెలవడం ఖాయమని అంటున్నారు. కానీ ఇతర పార్టీ ఎమ్మెల్యేల మద్ధతు కూడగడితే రెండు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ కానీ , బిఆర్ఎస్ కానీ సాధించుకోవచ్చు. ఇందుకోసం ఇరు పార్టీలు ఇంటర్నల్ గానూ పలువురి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం సీఎం రేవంత్ ఢిల్లీ లో ఉన్నారు..ఆయన రాగానే దీనిపై కసరత్తులు చేయనున్నారని సమాచారం.

Read Also : AP : కాపు నేతలతో నాగబాబు భేటీ ..