Site icon HashtagU Telugu

UAPA Telangana: ప్రజా సమస్యలపై ఉద్యమించిన 146 మందిపై ఎఫ్‌ఐఆర్‌

UAPA Telangana

New Web Story Copy 2023 06 24t170957.880

UAPA Telangana: నిషేధిత సీపీఐ(మావోయిస్ట్)తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విద్యార్థులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు సహా 146 మంది కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది తెలంగాణ పోలీస్ శాఖ. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) ప్రయోగించడాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ క్రమంలో సామాజిక ఉద్యమాలకు ప్రసిద్ధి చెందిన నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ (NAPM) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఈ మేరకు లేఖ పంపింది. ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే కొట్టివేయాలని, ఈ ఎఫ్‌ఐఆర్ కింద అరెస్టు చేసిన నిందితులందరినీ విడుదల చేయాలని సంస్థ ముఖ్యమంత్రి కెసిఆర్ ని కోరింది. తెలంగాణలోని ఉద్యమకారులను అణచివేసే ప్రక్రియ మానుకోవాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. అదేవిధంగా యూఏపీఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. కేసు మోపబడ్డ వారు నేరస్థులు కాదు. వారు సామాజిక కార్యకర్తలని పేర్కొంది.

Read More: T leaders in delhi : ఢిల్లీలో తెలంగాణ రాజ‌కీయ వేడి