Site icon HashtagU Telugu

LS Polls: సాయంత్రం 6 తర్వాత తెలంగాణలో 144 సెక్షన్: సీఈఓ వికాస్ రాజ్

Vikasraj

Vikasraj

LS Polls: సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ రాష్ట్రం అంతటా అమలు అవుతుందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. నలుగురి కంటే తక్కువ వ్యక్తులు తిరుగొద్దు అని, ఎలక్ట్రానిక్ మీడియా లో ఎలాంటి ప్రచారం ఆరు గంటల నుంచి చేయొద్దని సూచించారు. జూన్ 1వ తేది సాయంత్రం 6.30 నిమిషాల వరకు బ్యాన్ ఉంటుందని, కొన్ని సంస్థలు మే 13వ తేదిన సెలవు ఇవ్వడం లేదని అని తెలుస్తోంది…ఆ రోజు సెలవు ఇవ్వకపోతే చర్యలు ఉంటాయన్నారు.

‘‘కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్, హోటల్స్ లలో ఉన్న ఇతర జిల్లాల వ్యక్తులు వెళ్లిపోవాలి. రేపు, ఎల్లుండి పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలి. 160 కేంద్ర కంపినిల బలగాలు రాష్ట్రంలో ఇప్పటికే మొహరించాయి. ఇతర రాష్ట్రాల నుంచి 20వేల పోలీస్ బలగాలు మోహరించాయి. ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్ లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి’’ అని తెలిపారు.

‘‘సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో 232 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.320 కోట్ల సిజింగ్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. 8600 FIR లు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. 1లక్ష 90వేల మంది పోలింగ్ విధుల్లో సిబ్బంది డైరెక్ట్ గా పాల్గొంటున్నారు….మొత్తం 3లక్షల మంది ఉన్నారు. వచ్చే 48 గంటల పాటు వచ్చే ఫిర్యాదుల పై 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి. 1లక్ష 88 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇప్పటి వరకు పోల్ అయ్యాయి. 21680 మంది ఓటర్లు హోం ఓటింగ్ వేసుకున్నారు’’ సీఈఓ వికాస్ రాజ్ అన్నారు.

Exit mobile version