New Medical Colleges : తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. కొత్తగా తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలు, ఏపీలో 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో ఏర్పాటైన వైద్య కళాశాలలను సీఎం కేసీఆర్, ఏపీలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలను సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు. తెలంగాణలో గతేడాది ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఇప్పుడు ఇంకో 9 అందుబాటులోకి రావడం గమనార్హం. దీంతో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణలో ఏర్పాటైన మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 29కి పెరిగింది.
Also read : Tet-Exam : తెలంగాణ టెట్ పరీక్ష కేంద్రంలో విషాదం..నిండు గర్భిణీ మృతి
తెలంగాణలోని కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగిన మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాలకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక ఏపీలోని విజయనగరంలో పర్యటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి… తొలుత అక్కడ ఏర్పాటుచేసిన మెడికల్ కాలేజీని(New Medical Colleges) ప్రారంభించారు. అక్కడి నుంచి వర్చువల్‌గా రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఏర్పాటుచేసిన వైద్య కళాశాలలను ప్రారంభించారు.