Site icon HashtagU Telugu

SBI Jobs : ఎస్‌బీఐ‌లో 13,735 జాబ్స్.. తెలంగాణలో 342, ఏపీలో 50 ఖాళీలు

Sbi Jobsjunior Associates Telangana Ap Jobs 2024

SBI Jobs : మన దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ). ఎస్‌బీఐలో జాబ్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. ఎంతోమంది యూత్ ఈ బ్యాంకులో జాబ్స్ కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. భారీగా 13,735 జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ(SBI Jobs) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో 342 జాబ్స్ తెలంగాణలో, 50 జాబ్స్  ఏపీలో ఉన్నాయి. అందుకే తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ​ 2024 డిసెంబర్ 31 నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.  ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లలోపు వయసు కలిగిన  జనరల్ అభ్యర్థులు అప్లై చేయొచ్చు. దరఖాస్తులను సమర్పించేందుకు లాస్ట్ డేట్ జనవరి 7.

Also Read :Starlink In Manipur : మణిపూర్ ఉగ్రవాదుల చేతిలో ‘స్టార్ లింక్’.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదీ

  • అభ్యర్థులు www.sbi.co.in వెబ్‌సైట్‌ ద్వారా అప్లికేషన్లు సమర్పించొచ్చు.
  • ఓబీసీ/ జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ఎక్స్‌ఎస్‌/ డీఎక్స్‌ఎస్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.
  • వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ప్రిలిమ్స్‌ పరీక్ష, మార్చి లేదా ఏప్రిల్‌‌లో మెయిన్‌ పరీక్ష జరుగుతాయి.
  • ప్రిలిమ్స్​ అర్హత పరీక్ష మాత్రమే. తుది ఎంపికలో ప్రిలిమ్స్‌ పరీక్షలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
  • ఈ ఏడాది నవంబరు 30లోగా ఎస్‌బీఐలో అప్రెంటిస్‌షిప్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు మెయిన్స్‌ పరీక్షలో 5 మార్కులు అదనంగా కలుపుతారు.
  • ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుకు ఎంపికయ్యే వారికి నెలవారీ మూలవేతనం  రూ.26,730 ఉంటుంది.
  • ముంబై లాంటి మహానగరాల్లో శాలరీ రూ.46 వేల నుంచి ప్రారంభం అవుతుంది. పీఎఫ్, లీవ్‌ ఫేర్, మెడికల్, పెన్షన్, ఇతర సదుపాయాలు కల్పిస్తారు.
  • గతంలో నిర్వహించిన మోడల్​ పేపర్లను పరిశీలించి ఏ సబ్జెక్టుల్లో ఏ టాపిక్స్‌ నుంచి ప్రశ్నలు వస్తున్నాయో అభ్యర్థులు తెలుసుకోవాలి. ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్‌ విభాగాల్లో ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను గమనించాలి.
  • ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలకు ఏకకాలంలో అభ్యర్థులు ప్రిపేర్ కావాలి.
  • ప్రిలిమ్స్​, మెయిన్స్​​లోని నాలుగు విభాగాల్లో కాఠిన్యత, ప్రాముఖ్యం ఆధారంగా రీజనింగ్, ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలకు 4:3:2:1 నిష్పత్తిలో సమయాన్ని కేటాయించుకోవాలి. ఒక రోజులో ఆప్టిట్యూడ్‌కు 4 గంటలు, రీజనింగ్‌కు 3 గంటలు, ఇంగ్లిష్​కు 2 గంటలు, జనరల్‌ అవేర్‌నెస్‌కు ఒక గంట సమయాన్ని కేటాయించాలి.